Current Affairs In Telugu / 16-31 JULY 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 16-31 JULY 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా జులై నెల 16 తారీకు నుండి 31 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని వివరించడం జరిగింది.

 

యూరో కప్ విజేత స్పెయిన్

  • బెర్లిన్ లో జరిగిన యూరో కప్ తుది పోరులో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచింది.
  • ఫైనల్లో స్పెయిన్ తరపున నికో విలియమ్స్ (47 వ నిమిషంలో) , మైకేల్ ఓయర్ జబాల్ (86 వ నిమిషంలో) గోల్స్ చేయగా ఇంగ్లాండ్ తరపున కోల్ పాల్మర్ (73 వ నిమిషంలో ) గోల్స్ చేశాడు.
  • ఒక యూరో కప్ ఎడిషన్ లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ను కూడా స్పెయిన్ 15 గోల్స్ తో బ్రేక్ చేసింది అంతకుముందు  ప్రాన్స్ 1984 సంవత్సరంలో చేసిన 14 గోల్స్ అత్యధికం.
  • యూరో కప్ గెలవడం స్పెయిన్ కి ఇది 4 వ సారి ఇంతకుముందు 1964,2008,2012 లోనూ స్పెయిన్ యూరో కప్ విజేతగా నిలిచింది.
  • అత్యధిక యూరో కప్ టైటిల్ లను గెలుచుకున్న జట్టుగా జర్మనీ (03) ను వెనక్కి నెట్టి స్పెయిన్ (04) మొదటి స్థానంలో నిలిచింది.
  • స్పెయిన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండ యూరో కప్ టైటిల్ గెలువడం ఇది 2 వ సారి, 2008 లో కూడా ఆ జట్టు ఒక్క ఓడిపోకుండా యూరో కప్ టైటిల్ గెలిచింది.
  • ఇంగ్లాండ్ యూరో కప్ ఫైనల్ విడిపోవడం ఇది 2వ సారి మొదటగా 2021 లో ఇటలీ చేతిలో విడిపోయింది.
  • ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నీకో విలియమ్స్ (స్పెయిన్)
  • ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా రోడ్రి (స్పెయిన్)
  • ఉత్తమ యువ ఆటగాడు యమల్ (స్పెయిన్)
  • 3 గోల్స్ తో బంగారు బూటు పొందిన ఆటగాళ్లు గప్కో (నెదర్లాండ్), హ్యారికెన్ (ఇంగ్లాండ్), ఓల్మో (స్పెయిన్), యూసియాల (జర్మనీ), ఇవాన్ (స్లోవేకియా), జార్జెస్ (జార్జియా).
  • యూరో కప్ విజేతగా నిలిచిన స్పెయిన్ కి 72.94 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, రన్నరప్ ఇంగ్లాండ్ 45.60 కోట్లు అందుకుంది.
  • ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పాల్గొన్నాయి, జర్మనీ వేదికగా జూన్ 14 నుండి జులై 14 వరకు జరిగింది.
  • తర్వాతి యూరో కప్ 2028 సంవత్సరంలో UK మరియు ఐర్లాండ్, 2032 లో జరిగే యూరో కప్ ను ఇటలీ మరియు టర్కీ దేశాలు నిర్వహించనున్నాయి.

 

కోపా అమెరికా టైటిల్ గెలిచిన డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా

  • మియామీ గార్డెన్ లో జరిగిన కోపా అమెరికా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1-0 తేడాతో కొలంబియను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
  • అదనపు సమయంలో అర్జెంటీనా ఆటగాడు లాటారో మర్తినేజ్ (112 వ నిమిషంలో) గోల్ చేసి జట్టును గెలిపించాడు.
  • అత్యధిక కోపా అమెరికా టైటిళ్లు గెలిచిన జట్టుగా ఉరుగ్వే (14 టైటిళ్లు) వెనక్కి నెట్టి 15 టైటిళ్ళతో అర్జెంటీనా ముందుస్తానంలో నిలిచింది.
  • ఈ విజయంతో అత్యధిక టైటిళ్లు ( క్లబ్+దేశం) గెలిచిన ఆటగాడిగా మెస్సీ 45 టైటిళ్లతో బ్రెజిల్ ఆటగాడు ఆల్వేస్ (44) ను అధిగమించాడు.
  • అమెరికాలోని 14 నగరాలలో జూన్ 20 నుండి జులై 14 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది.
  • మొత్తం 16 టీంలు ఈ టోర్నీ లో పాల్గొన్నాయి.
  • తర్వాతి కోపా అమెరికా టోర్నమెంట్ 2028 సంవత్సరంలో పరాగ్వేలో జరుగనుంది.

 

జూకంటి జగన్నాథంకి దాశరథి పురస్కారం 

  • తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని 2024 సంవత్సరానికి గాను జూకంటి జగన్నాథం గారు ఎంపికయ్యారు.
  • ఈ పురస్కారంతో 1,01,116 రూపాయల నగదు మరియు జ్ఞాపికను అందజేస్తారు.
  • ఇతను 1955 సంవత్సరంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించారు
  • 1993 లో పాతాళ గరిగే మొదలు 2020 సద్దిముల్లె వరకు ఆయన 16 కవితా సంకలనాలు వెలువరించారు.
  • 2007-2013 వరకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా పనిచేశారు.
  • 2014 నుండి అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
  • జూకంటి జగన్నాథం పొందిన అవార్డులలో కొన్ని సినారె కవితా పురస్కారం (1998), గరికపాటి పురస్కారం (2004), తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త అవార్డు (2015), సి. నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం (2020).
  • శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ప్రతి సంవత్సరం అందించే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024 సంవత్సరానికి గాను అందెశ్రీ గారు ఎంపికయ్యారు.

 

రాహుల్ గాంధీకి ఉమెన్ చాందీ అవార్డు

  • కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్కరణార్థం అందించనున్న ఉమెన్ చాందీ తొలి పురస్కారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఎంపికయ్యారు
  • భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలకు చేసిన సేవలకి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఉమెన్ చాందీ ఫౌండేషన్ వారు తెలియచేశారు.

 

టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్

  • భారత్ కి చెందిన ఇద్దరు ఆటగాళ్లు TENNIS HALL OF FAME ఎంపికయ్యారు. ఆటగాడి విభాగంలో లియండర్ ఫేస్, టెన్నిస్ కి సేవలు అందించిన ప్లేయర్స్ విభాగంలో విజయ్ అమృత్ రాజ్ లు ఎంపికయ్యారు విజయ్ తో పాటు అమెరికాకి చెందిన రిచర్డ్ ఇవాన్స్ ఎంపికయ్యాడు.
  • లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఓలెంపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో పాటు గ్రాండ్ స్లామ్ టార్నీల్లో 08 డబుల్స్, 10 మిక్సెడ్ డబుల్స్ టైటిళ్లు సాధించాడు. మరియు 1992 నుండి 2016 వరకు 07 ఇండియా తరపున ఒలెంపిక్స్ లో పాల్గొన్నాడు.
  • లియాండర్ పేస్ కంటే ముందు విజయ్ అమృత్ రాజ్ ప్రపంచ స్థాయిలో భారత టెన్నిస్ కి పేరు తెచ్చాడు

 

తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ

  • కేంద్ర ప్రభుత్వం 27 జూలై 2024 రోజున 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 07గురు కొత్తవారు కాగా, ముగ్గురు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ అయ్యారు.
  • తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఇతను త్రిపుర రాష్ట్రానికి 2018 – 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు 
  • ఇతర రాష్ట్రాలకు గవర్నర్లు గా నియమితులైన వారు
  1. మహరాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణ ( ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు),
  2. రాజస్థాన్ గవర్నర్ గా హరిభావ్ కిషన్ రావు భాగ్దే,
  3. సిక్కిం గవర్నర్ గా ఓం ప్రకాష్ మాతుర్,
  4. అస్సాం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ( ప్రస్తుతం ఇతను సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు),
  5. జార్ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగ్వార్,
  6. ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఎంపీ రమేష్ డేక,
  7. మేఘాలయ గవర్నర్ గా సీ హెచ్ విజయ శంకర్,
  8. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కె కైలాసనాథ్ నియమితులయ్యారు,
  9. పంజాబ్ గవర్నర్ మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా గులాబ్ చంద్ కటారియా ( ప్రస్తుతం అస్సాం గవర్నర్ గా పనిచేస్తున్నారు).

 

ఇతర ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 

  • అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ కి చెందిన గోపి తోటకూర నిలిచారు.రాకేష్ శర్మ 1984 తర్వాతి భారత్ నుంచి స్పేస్ లోకి వెళ్లి వచ్చిన 2 వ వ్యక్తిగా కూడా ఇతను గుర్తింపు పొందారు.
  • BSNL కి నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా రాబర్ట్ జేరార్డ్ రవి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
  • Paytm పేమెంట్ బ్యాంక్ నూతన CEO & MD గా అరుణ్ కుమార్ బన్సల్ నియమకం, బన్సల్ ఇంతకుముందు IDBI బ్యాంక్ ఎక్స్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు.ఇతను సురేందర్ చావ్లా స్థానంలో నూతనంగా నియమించబడ్డాడు.
  • విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇతను జాతీయ భద్రత ఉప సలహాదారుగా ఉన్నాడు, ఇతను 1989 బ్యాచ్ IFS అధికారి.
  • హైదరాబాద్ ORR పరిధి లోపల ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ప్రజలను విపత్తుల నుండి కాపాడడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు మొదలైన కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం సిఎం ఛైర్మన్ గా మంత్రులు సభ్యులుగా ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వము జులై 19 న GO విడుదల.
  • భారత విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.
  • 2023 సంవత్సరానికి గాను ఐరాస మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను భారత ఆర్మీ మేజర్ రాధిక సేన్ గెలుచుకున్నారు.
  • భారత ఫుట్ బాల్ జట్టు ప్రధాన కోచ్ గా స్పెయిన్ కి చెందిన మనోలో మార్కేజ్ నియమితులయ్యారు.
  • UPSC ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా, అతను 2022 ఏప్రిల్ 05 నుండి UPSC Chairman గా పని చేస్తున్నాడు, 2029 మే 15 వరకు పదవి కాలం ఉన్న ముందే రాజీనామా చెయ్యండం జరిగింది.
  • అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల రేసు నుండి అనూహ్యంగా తప్పుకోవడం జరిగింది, తదుపరి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
  • Internatinal Solar Alliance లో 97 వ సభ్య దేశంగా చేరిన పనామా.
  • మహిళల ఆసియా కప్ టి20 విజేత శ్రీలంక. రన్నరప్ గా భారత మహిళల జట్టు నిలిచింది.
  • క్యాబ్ బుకింగ్ సేవలు అందించే ప్రముఖ సంస్థ రాపిడో యునికార్న్ హోదా సాధించింది. ప్రైవేటు నిర్వహణలోని సంస్థ యొక్క విలువ 100 కోట్ల డాలర్ (8300 కోట్లు) చేరితే దాన్ని యునికార్న్ గా వ్యవహరిస్తారు.
  • Asian Institute of Gastroenterology (Hyderabad) ఛైర్మన్ డా.డి నాగేశ్వర్ రెడ్డి గారికి America లోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అందించే కెప్టెన్ చైర్ అవార్డుకు ఎంపిక అయ్యారు., వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
  • ప్రసాద్ భారతి నూతన చైర్మన్ గా నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు.
  • 2024 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ( మార్చి 15 ) థీమ్ FAIR AND RESPONSIBLE AI FOR CONSUMERS.
  • 2024 ప్రపంచ హైపాటైటిస్ డే ( జులై 28 ) థీమ్ IT’S TIME FOR ACTION
  • సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రముఖ కవి యాకూబ్ ఎంపికయ్యారు, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంది.

 

Also Read posts ;

 Daily Current Affairs Telugu / 01-15 JULY 2024 

Daily Current Affairs Telugu / 17-30 JUNE 2024

         Daily Current Affairs Telugu / 04-16 June 2024

 

 

1 thought on “Current Affairs In Telugu / 16-31 JULY 2024 / GovtJobPreparation.com”

Comments are closed.