Current Affairs In Telugu / 01-15 July 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 1-July ; ఈ ఆర్టికల్ ద్వారా జులై నెల 1 తారీకు నుండి 15 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు 

  • జులై 01; బ్రిటీష్ వలస పాలనలో న్యాయ వ్యవస్థ కోసం వారు తీసుకువచ్చిన భారత శిక్షా స్మృతి (IPC), నేర శిక్షా స్మృతి (CRPC), భారత సాక్ష్యాధార చట్టం (IVA) చట్టాల స్థానాల్లో భారత ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియం (BSA) చట్టాలను తీసుకువచ్చింది
  • ఈ చట్టాలు జులై 01 2024 నుండి అమలులోకి వచ్చాయి 
  • ఈ చట్టాల ప్రకారం నేరం జరిగిన 60 రోజుల లోపు అభియోగాలు నమోదు, విచారణ జరిగిన 45 రోజుల లోపు తీర్పు వెలువడాలి.
  • Online లో ఫిర్యాదు, ZERO FIR, SMS లాంటి పద్ధతుల ద్వారా సమన్ల జారీ మొదలైన ఆధునిక పద్ధతులను చేర్చారు
  • భారతీయ న్యాయ సంహితలో మొత్తం 358 విభాగాలు కలవు
  • భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం అనే సెక్షన్ ను తొలగించారు, దాని స్థానంలో దేశ సమైక్యత, సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగిస్తే శిక్షర్హం గా ప్రకటించారు.
  • కొత్త చట్టం ప్రకారం నేరం జరిగినప్పుడు ఏ పోలీసు స్టేషన్ లో ఐన ఫిర్యాదు చేయవచ్చు తర్వాత నేరం జరిగిన ప్రాంతంలోని పోలీసు స్టేషన్ కి 15 రోజుల్లోగా బదిలీ చెయ్యాలి.
  • కొత్త చట్టం ప్రకారం మొదటి కేసు జులై 01 అర్ధరాత్రి 12:10 గంటలకి బైక్ దొంగతనానికి సంబంధించిన కేసు గ్వాలియర్ (మధ్య ప్రదేశ్) లో నమోదైనది.

 

ICC T20 ప్రపంచకప్ జట్టులో భారత్ నుండి 6 గురు ఆటగాళ్లు 

  • ఇటీవల జరిగిన ICC T20 ప్రపంచకప్ లో రాణించిన ఆటగాళ్లతో ICC 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది
  • భారత్ నుండి రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ఆర్షదీప్ సింగ్; ఆఫ్గనిస్తాన్ నుండి రహ్మతుల్ల గుర్భాజ్, ఫజల్ హక్ ఫారుఖీ, రషీద్ ఖాన్; ఆస్ట్రేలియా నుండి మార్కస్ స్టాయినిస్; వెస్టిండీస్ నుండి నికోలస్ పూరన్; మరియు 12 వ ప్లేయర్ గా సౌత్ ఆఫ్రికా నుండి ఎన్రిచ్ నోకియా ఎంపికయ్యారు.

 

మాతృ భూమికి నిధులు పంపడంలో భారత్ టాప్ 

  • విదేశాల్లో ఉంటూ మాతృ భూమికి ఆదాయం పంపించడం లో (రెమిటెన్స్) ప్రపంచ దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది 
  • 2023 సంవత్సరంలో మొత్తం 120 బిలియన్ డాలర్ల ( సుమారుగా 10 లక్షల కోట్లు ) రెమిటెన్స్ ఇండియా అందుకున్నది
  • భారత్ తర్వాత స్థానాల్లో వరసగా చైనా 50 బిలియన్ డాలర్లు , ఫిలిప్పీన్స్ 39 బిలియన్ డాలర్లు , పాకిస్థాన్ బిలియన్ డాలర్ల రెమిటెన్స్ అందుకున్నాయి
  • ఇండియా కు అత్యధికంగా అమెరికా నుండి రెమిటెన్స్ వచ్చాయి, ఆ తర్వాత UAE నుండి వచ్చాయి.

బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్

  • 04,ఆగస్టు న జరిగిన బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మార్ బ్రిటన్ నూతన ప్రధానిగా నియమితులయ్యారు
  • విజయం అనంతరం బకింగ్ హామ్ ప్యాలెస్ లో బ్రిటన్ రాజు చార్లెస్-3 ను కలవడం, తను స్తార్మర్ నియామకాన్ని ఆమోదించడం జరిగింది.
  • సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మార్ నాయకత్వం లోని లేబర్ పార్టీ 650 స్థానాలకు గాను 33.7% ఓట్లతో 412 సీట్లను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో లేబర్ పార్టీ 201 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
  • తాజా విజయంతో 14 సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 
  • భారత సంతతి వ్యక్తి, మాజీ ప్రధాని రిషి సునక్ ఆధ్వర్యం లోని అధికార కన్జర్వేటివ్ పార్టీ 23.7% ఓట్లతో 121 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
  • 72 సీట్లతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 3 వ స్థానములో నిలచింది.
  • ప్రధానిగా ప్రమాణం చేసిన కీర్ స్టార్మార్ లండన్ లోని హాల్ బోర్న్ – సెయింట్ పాంక్రస్ నియోజకవర్గం నుంచి 18 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.
  • రిషి సునాక్ రిచ్మండ్ & నార్తర్న్ అలర్టన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో భారత సంతతికి చెందిన 28 అభ్యర్థులు విజయం సాధించారు, లీసా నాండీ బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

 

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా క్రిజికోవా

  • వింబుల్డన్ మహిళల సింగిల్స్ తుది పోరులో చెక్ రిపబ్లిక్ కు చెందిన 3 వ సీడ్ బార్బోరా క్రెజికోవా ఇటలీకి చెందిన 2వ సీడ్ జాస్మిన్ పావోలిని పై 6-2, 2-6, 6-4  పాయింట్ల తేడాతో విజయం సాధించి తొలి వింబుల్డన్ టైటిల్ ను సాధించింది.
  • క్రెజికోవా కి ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్, మొదటిసారి 2021 లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలిచింది.
  • ఫైనల్  ఆడిన ఇద్దరికీ ఇది తొలి వింబుల్డన్ ఫైనల్
  • 2016 సెరెనా విలియమ్స్ గెలిచిన తర్వాత జరిగిన ప్రతిసారీ వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో కొత్తవారు చాంపియన్ గా నిలిచారు.

 

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాస్

  • వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తుది పోరులో స్పెయిన్ కు చెందిన 3 వ సీడ్ కార్లోస్ అల్కరాస్ సెర్బియా కి చెందిన 2వ సీడ్ నోవాక్ జకోవిచ్ పై 6-2, 6-2, 7-6(7-4)  పాయింట్ల తేడాతో విజయం సాధించి వరసగా 2 వ సారి వింబుల్డన్ టైటిల్ ను సాధించాడు 
  • కార్లోస్ అల్కరాస్ కి ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ . 2022 లో యుఎస్ ఓపెన్ గెలిచిన అతను 2023 లో వింబుల్డన్ మరియు ఈ సంవత్సరంలో వరసగా ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ ఓపెన్ లను గెలుచుకున్నాడు.
  • ఫైనల్ చేరిన తొలి 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ లను గెలుచుకున్న ఆటగాడిగా ఫెదరర్ పక్కన నిలిచాడు.

ఇతర ముఖ్యమైన అంశాలు 

  • నేషనల్ స్టాటాస్టిక్స్ డే (జూన్ 29) 2024 థీమ్ ; USE OF DATA FOR DECITION MAKING. 
  • WORLD INVESTMENT RANKING – 2023 లో భారత్ 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 15 వ ర్యాంక్ కి పడిపోయింది, 2022 లో ఇండియా 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 8 వ ర్యాంక్ లో నిలిచింది.
  • నల్లమల అడవుల్లో 154 సంవత్సరాల తర్వాత అడవి దున్న కనిపించింది,1870 తర్వాత నల్లమల అడవుల్లో అడవిదున్న కనిపించడం జరిగింది.
  • ఇంగ్లీష్ ఛానల్ ( బ్రిటన్ లోని డోవర్ నుండి ఫ్రెంచ్ తీరం వరకు 42KM’s ) ఈదిన మొదటి భారతీయ మాతృ మూర్తిగా 33 ఏళ్ల తన్వీ చవాన్ దేవరే ( మహరాష్ట్ర ) రికార్డ్ సృష్టించారు, ఈమె 17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ను ఈదింది.
  • కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త ఛైర్మన్ గా రవి అగర్వాల్ నియమితులయ్యారు, ఈయన 2025 జూన్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు 
  • ప్రముఖ ఉద్యమకారిణి మేధా పాట్కర్ కి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్ట్ 5నెలల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన VK సక్సేన గతంలో గుజరాత్ లో Council For Civil Liberty’s స్వచ్చంద సంస్థకి డైరెక్టర్ గా ఉన్న సమయంలో మేధా పాట్కర్ ఆయానను పిరికిపందగా హవాలా భాగస్వామిగా వర్ణించారు, ఆ వ్యాఖ్యలపై VK సక్సేన పరువునష్టం కేసు వేశారు, ఆ కేసులో కోర్ట్ పాట్కర్ కి శిక్ష విధించడం జరిగింది.
  • ఇండియన్ మనుఫ్యాక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా ఎన్నికయ్యారు, ఇతను రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతున్నారు, ప్రస్తుతము ఇతను భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పని చేస్తున్నాడు.
  • విశ్వంభర డా. సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి గాను ప్రముఖ తమిళ రచయిత, 2022 సంవత్సరంలో సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి ఎన్నికయ్యారు. ఈ అవార్డు కింద 5,00,000 నగదు బహుమతితో పాటు శాలువా, మరియు ఒక జ్ఞాపిక ను అందచేస్తారు.
  • తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) గా సి. సుదర్శన్ రెడ్డి ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన GAD ముఖ్య కార్యదర్శి గా పనిచేస్తున్నారు.
  • సుప్రింకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 4 వ సారి ఎన్నికైన కపిల్ సిబల్.
  • తెలంగాణ నూతన డీజీపీ గా 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన జితేందర్ జులై 10 న నియమితులయ్యారు.
  • కోఫీ అన్నన్ కరేజ్ ఇన్ కార్టూనింగ్ అవార్డు గెలుచుకున్న భారత రాజకీయ కార్టూనిస్ట్ రచిత తనేజా 
  • జులై 13; అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా లోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు అతనికి తృటిలో ప్రాణాపాయం తప్పింది..
  • ఫైనల్లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ను ఓడించి లెజెండ్స్ టైటిల్ ను గెలుచుకున్న భారత ఛాంపియన్స్ జట్టు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అంబటి రాయుడు నిలిచారు. భారత జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించాడు.
  • నేపాల్ నూతన ప్రధానిగా K. పి.శర్మ ఓలి. ప్రమాణ స్వీకారం చేయించిన ఆ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు.
  • ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25 (1975) ను ఇక నుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ హత్య దినం ( సంవిధాన్ హత్యాధివస్) గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం జులై 12 న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

 

 

 

Current Affairs / july 01 To 15