Current Affairs In Telugu / 17-30 June 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 17-30 June ; ఈ ఆర్టికల్ ద్వారా జూన్ నెల 17 తారీకు నుండి 30 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం 

  • వరి,పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ మొదటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
  1. వరి సాధారణ రకం = 2300 &.        గ్రేడ్ A.    = 2320
  2. పత్తి మధ్య రకం.    = 7121 & పొడుగు పింజ = 7521
  3. జొన్న హైబ్రిడ్         = 3371 &.      మల్దంది     =3421
  4. సజ్జలు.                  =2625
  5. రాగులు.                 =4290
  6. మొక్కజొన్న            =2225
  7. కందులు.                 =7550
  8. పెసర్లు.                    =8682
  9. మినుములు            =7400
  10. వేరుశనగ.               =6783
  11. పొద్దుతిరుగుడు      =7280
  12. సోయాబీన్.            =4892
  13. నువ్వులు.               =9267
  14. నల్ల నువ్వులు         =8717
  • ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 22 రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది
  • 22 పంటలలో 14 ఖరీఫ్ సీజన్ పంటలు, 06 రబీ సీజన్ పంటలు మరియు 02 వాణిజ్య పంటలు.
  • 22 పంటలతో పాటు చెరకు పంట కొనుగోలు కోసం ప్రత్యేకంగా FAIR AND REMUNERATIVE పేరుతో ప్రత్యేకంగా కొనుగోలు ధరను ప్రకటిస్తుంది.
  • కనీస మద్దతు ధరను ప్రతి సంవత్సరం విత్తనాలు నాటే ముందు ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటిస్తుంది
  • వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ కనీస మద్దతు ధరలను సిఫారసు చేస్తుంది

 

ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ 

  • 18వ లోక్ సభ ప్రోటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ఎన్నికయ్యాడు
  • ఇతను కటక్ పార్లమెంటరీ నియోజకవర్గం (ఒడిశా) నుండి బీజేపీ పార్టీ తరపున ఎన్నికయ్యాడు
  • ఇతను ఎంపీ గా ఎన్నికవ్వడం ఇది 7వ సారి
  • రాజ్యాంగం లోని ఆర్టికల్ 95(1) ప్రకారం కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెమ్ స్పీకర్ సభను నడిపిస్తారు.

 

53వ GST పాలక మండలి సమావేశం

  • 53 వ GST పాలక మండలి సమావేశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగింది
  • రైల్వే సర్వీసులపై GST నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు, ప్లాట్ ఫామ్ టికెట్లు, వెయిటింగ్ రూం, క్లాక్ రూం మొదలైన సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు
  • స్టీల్, అల్యూమినియం, ఐరన్ తో తయారైన మిల్క్ క్యాన్ లపై 12% & కార్టెన్ బాక్సులు, కేస్ లపై GST ని 18% నుండి 12% నికి తగ్గించారు
  • విద్యాసంస్థలకు వెలుపల ఒక వ్యక్తి పై నెలకు 20 వేల కంటే తక్కువ ఫీజు ఉండే హాస్టల్ లకు GST నుండి మినహాయింపు ఇచ్చారు.
  • ఎరువులపై GST మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటి కి అప్పగిస్తూ నిర్ణయం
  • రాష్ట్రాలు అన్ని ఒక నిర్ణయానికి వస్తే పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.

 

జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రక్షాళనకు కమిటీ

  • నెట్, నీట్ పరీక్ష పత్రాలు లీకైన నేపథ్యంలో NTA ను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ K. రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన కమిటీ నీ నియమించినది.
  • NTA నిర్మాణం – పని విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, పరీక్షా నిర్వహణ యంత్రాంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలు, డేటా సెక్యూరిటి ప్రోటోకాల్స్ ను మెరుగుపరచడం మొదలైన అంశాలలో తీసుకురావాల్సిన సంస్కరణలు గురించి కమిటీ నివేదిక ఇవ్వనుంది.
  • కమిటీ 2 నెలల్లోగా నివేదిక ఇవ్వనుంది.
  • కమిటీ నిర్మాణం

చైర్మన్ ; K. రాధాకృష్ణన్

సభ్యులు;

  1. రాణదీప్ గులేరియా
  2. BJ రావు
  3. పంకజ్ బన్సల్
  4. ఆదిత్య మిత్తల్
  5. గోవింద్ జైశ్వాల్
  6. K. రామమూర్తి

 

GST రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ

  • Goods and services tax (GST) పన్ను రేట్ల క్రమబద్దీకరణకు నియమించిన కమిటీని జూన్ 21 2024 న కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.
  • కమిటీ కన్వీనర్ గా సామ్రాట్ చౌద్రి (బీహార్ డిప్యూటీ సిఎం)
  • కమిటీ సభ్యులుగా సురేష్ కుమార్ కన్నా (ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి), మౌవిన్ గోడిహో (గోవా రవాణా శాఖ మంత్రి), గజేంద్ర సింగ్ (రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి), చంద్రిమా భట్టాచార్య (బెంగాల్ ఆర్ధిక మంత్రి), కృష్ణ బైరే గౌడ (కర్ణాటక ఆర్ధిక మంత్రి), KN బాల గోపాల్ (కేరళ ఆర్ధిక మంత్రి)

 

 

పరీక్ష పేపర్ లికేజ్ బాధ్యులపై ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్

  • పరీక్ష పేపర్ లీకేజ్ బాధ్యులను చట్టపరంగా శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది
  • ఈ చట్టం జూన్ 21 2024 నుండి అమలులోకి వచ్చింది
  • ఈ చట్టం ప్రకారం పేపర్ లీకేజి కి ఏ విధంగా కారణం అయినా లేదా చట్ట వ్యతిరేకంగా పరీక్ష పేపర్లను అందుకున్న వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు కోటి రూపాయల వరకు జరిమాన విధించబడుతుంది.

 

NATO నూతన సెక్రటరీ జనరల్ గా మార్క్ రుట్టె

  • ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి అయినా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) తర్వాతి 14వ సెక్రటరీ జనరల్ డచ్ ప్రధానమంత్రి అయినా మార్క్ రుట్టె నియమితులయ్యారు
  • ఈయన అక్టోబర్ 1 2024న పదవి బాధ్యతలను స్వీకరిస్తారు
  • NATO ప్రస్తుత సెక్రటరీ జనరల్  స్టోల్తెన్ బెర్గ్, ఇతను 2014 నుండి 2024 వరకు NATO సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు
  • NATO 1949 ఏప్రిల్ 04 తేదిన 12 వ్యవస్థాపక దేశాలతో ఏర్పడింది
  • ప్రస్తుతం NATO లో 32 దేశాలు కలవు, చివరగా స్వీడన్ 2024 మార్చి నెలలో జాయిన్ అయ్యింది 

 

T20 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత్ 

  • T20 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు నిలిచింది,ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టుపై 7 రన్స్ తేడాతో గెలిచింది 
  • ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లి (76), ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా జస్ ప్రీత్ బుమ్రా నిలిచారు.
  • టోర్నీ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రహ్మణుల్ల గుర్బాజ్ (281 రన్స్), అత్యధిక వికెట్లు (17 వికెట్లు) తీసిన బౌలర్ గా ఫజల్ హక్ ఫారూఖీ (ఆఫ్ఘనిస్తాన్) & అర్షదీప్ సింగ్ (ఇండియా) నిలిచారు.
  • భారత్ కి ఇది 2వ T20 ప్రపంచకప్, మొదటిది 2007 సంవత్సరంలో గెలుచుకుంది
  • ఇండియా (2007&2014), వెస్టిండీస్ (2012&2016), ఇంగ్లాండ్(2010&2022) జట్లు T20 ప్రపంచకప్ ను 2 సార్లు గెలుచుకున్నాయి.

 

మరికొన్ని ముఖ్యమైన అంశాలు;
  • అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ జెండర్లకి 1% రిజర్వేషన్ కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది.
  • టైం మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి మహిళా బాక్సర్ సాక్షి మాలిక్, బాలీవుడ్ నటి అలియా భట్, డైరెక్టర్ దేవ్ పటేల్ చోటు సాధించారు 
  • స్కై ట్రాక్స్ విడుదల చేసిన 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (దోహో, ఖతార్) నిలిచింది, తర్వాతి స్థానాలలో వరసగా సింగపూర్ కు చెందిన ఛాంగి విమానాశ్రయం, సియోల్ (దక్షిణ కొరియా) లోని ఇంచియన్ విమానాశ్రయాలు నిలిచాయి.
  • ఈ సంవత్సరం చివర్లో జరిగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ బీజేపీ పార్టీ ఎన్నికల ఇంఛార్జి గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు.
  • ఏపీ నూతన డీజీపీ గా ద్వారకా తిరుమల రావు భాద్యతలు స్వీకరించారు.
  • అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి బోర్నియో ఏనుగులు
  • విద్య, ఉద్యోగ అవకాశాల్లో BC, ST, SC రిజర్వేషన్లను 50% నుండి 65% నికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 & 16 లకు విరుద్ధం అని కొట్టివేయడం జరిగింది.
  • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నూతన ఛైర్మన్, MD గా మనోజ్ జైన్ భాద్యతలు స్వీకరించారు.
  • 10వ అంతర్జాతీయం యోగ దినోత్సవం (జూన్ 21) సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ షేర్ ఎ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో (శ్రీనగర్ లోని డాల్ సరస్సు పక్కన) యోగ ఆసనాలు వేసారు.
  • బంగ్లాదేశ్ ప్రదాని షేక్ హసిన భారత్ లో 2 రోజుల (జూన్ 21&22) పర్యటనకి వచ్చారు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా భారత్లో పర్యటించిన తొలి విదేశీ నేతగా నిలిచారు. భారత ప్రధాని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీ G7 సదస్సుకి వెళ్లి వచ్చారు.
  • తెలంగాణకు హరితహరం పేరును వన మహోత్సవం గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం.
  • ప్రసార భారతి నూతన ఛైర్మన్ గా నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు
  • నేషనల్ హెల్త్ పాలసీ-2017 ను అమలుచేయడం కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) 1418 కోట్ల (170 మిలియన్ డాలర్లు ) ఋణాన్ని మంజూరు చేసింది.
  • ఇందిరాగాంధీ జాతీయ ఎమర్జెన్సీ (జూన్ 25 1975) ప్రకటించి జూన్ 25 నాటికి 49 సంవత్సరాలు పూర్తి
  • BJP రాజ్యసభ పక్ష నేతలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా నియమితులయ్యారు, ఆ స్థానంలో ఉన్న పీయూష్ గోయల్ లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో JP నడ్డా ను నియమించారు
  • కేరళ పేరును కేరళం గా మార్చుటకు ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
  • మెన్స్ ప్రపంచ కప్ (ODI & T20) లో 3000 రన్స్ పూర్తిచేసిన తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.2637 రన్స్ తో రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు.
  • డక్ వర్త్ లూయిస్ ఆవిష్కర్తల్లో ఒకరైన ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు ప్రాంక్ డక్ వర్త్ జూన్ 21 న మరణించారు, డక్ వర్త్ లూయిస్ పద్ధతిని 1997 లో రూపొందించగా 2001 నుండి ICC దీనిని ప్రామాణికంగా తీసుకున్నది.
  • భారత ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు MP రాజ్ కుమార్ రోత్ తన ప్రమాణస్వీకారానికి ఒంటె పై పార్లమెంటు కి వచ్చారు
  • GST అప్పిలేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ మిశ్రా.
  • మహిళల క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ (113 బాల్స్) మరియు డబుల్ సెంచరీ (194 బాల్స్) చేసిన బ్యాట్స్ వుమెన్ గా షేఫాలి వర్మ (ఇండియా) నిలిచింది.
  • టెస్టు క్రికెట్ చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా భారత మహిళల క్రికెట్ జట్టు నిలిచింది, మహిళ జట్టు మొదటి రోజు చేసిన స్కోర్ 525.
  • భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రి నియామకం
  • కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త ఛైర్మన్ గా రవి అగర్వాల్ 
  • PEN ప్రింటర్ ప్రైజ్ అవార్డు 2024 విజేతగా అరుంధతి రాయ్.