Telangana staff Nurse Recruitment 2024 : తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి జాబ్ క్యాలెండర్ లో భాగంగా మరొక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోపల గల వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు & సమాచారం ;
- అప్లికేషన్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు
- అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ; 14/10/2024 ( 5Pm )
- పరీక్ష జరిగే తేదీ ; 17/11/2024
- పే స్కేల్ ; 36,750 – 1,06,990
ఖాళీల వివరాలు ;
సెలక్షన్ ప్రాసెస్ ;
- మొత్తం 100 పాయింట్ల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది
- 100 పాయింట్ లో 20 పాయింట్లకు రాత పరీక్ష నిర్వహిస్తారు
- రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో ఉంటుంది
- తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలలో / ఇన్స్టిట్యూట్ లలో / ప్రోగ్రాములలో కాంట్రాక్టు ప్రాతిపదికన లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన వారికి వారి సర్వీస్ ఆధారంగా గరిష్టంగా 20 మార్పులను కలపడం జరుగుతుంది.
- జోనల్ విధానంలో ఈ సెలక్షన్ జరుగుతుంది
అర్హతలు ;
- general nursing and midwiry ( GNM ) ( OR )
- B.sc Narsing
వయస్సు ;
- అభ్యర్థుల వయస్సు 01/07/2024 నాటికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి
- గరిష్ట వయస్సు విషయంలో క్రింద తెలిపిన వర్గాల వారికి మినహాయింపు ఉంటుంది.
ఫీజు వివరాలు ;
- అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపాయలు చెల్లించాలి.
- ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అయితే తెలంగాణకు చెందిన SC, ST, BC, EWC, PH మరియు Ex Service men కు చెందిన అభ్యర్థులకు ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది
సిలబస్ & పరీక్ష విధానం ;
- ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది
- మొత్తం 80 ప్రశ్నలకు 80 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఎంపిక చేసిన 13 కేంద్రాలను పరీక్షను నిర్వహించనున్నారు
- GNM లెవెల్ లో పరీక్ష పేపర్ స్థాయి ఉంటుంది. పూర్తి సిలబస్ చూసినట్లయితే
- Anatomy & physiology
- Microbiology
- Physiology
- Sociology
- Fundamental of nursing
- First aid
- Community health nursing 1
- Environmental hygiene
- Health education and communication skills
- Nutrition
- Medical surgical nursing 1
- Medical surgical nursing 2
- Mental health nursing
- Child health nursing
- midwifery and gynecological Narsingh
- Community health nursing 2
- Nursing education
- Introduction to research
- Professional trends and adjustment
- Professional administration and ward management , ( పూర్తి సిలబస్ కోసం నోటిఫికేషన్ ను చూడగలరు )
పరీక్ష కేంద్రాలు ;
- అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసే సమయంలో పరీక్ష కేంద్రాలను ప్రయారిటీ ప్రకారం ఎంచుకోవాలి, దాని ప్రకారం మీకు ఎగ్జాం సెంటర్ కేటాయించడం జరుగుతుంది
- హైదరాబాద్
- వరంగల్
- కరీంనగర్
- నల్గొండ
- ఖమ్మం
- ఆదిలాబాద్
- మహబూబ్ నగర్
- నిజామాబాద్
- కోదాడ
- కొత్తగూడెం
- సత్తుపల్లి
- సంగారెడ్డి
- నర్సంపేట
జోనల్ వారీగా ఖాళీల వివరాలు ;
అనుబంధ నోటిఫికేషన్
- 2050 వెకెన్సీ లతో 18/09/2024 న విడుదల చేసిన STAFF NURSE నోటిఫికేషన్ కి అనుబంధంగా మరో 272 STAFF NURSE UNDER ADMINISTRATIVE CONTROL పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ను MHSRB 11/10/2024 న జారీచేసింది.
- మీరు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసి ఉంటే మరల ఈ పోస్టుల కోసం అప్లై చేయనవసరం లేదు, ఆ నోటిఫికేషన్ కే పోస్టులు ఆడ్ చేసినందు వల్ల మీరు మరలా అప్లై చేయనవసరం లేదు.
- ఆడ్ చేసిన 272 పోస్టులతో కలిపి మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 2322 పోస్టులను భర్తీ చేయనున్నారు.
CLICK HERE TO DOWNLOAD STAFF NURSE FULL NOTIFICATION
CLICK HERE TO DOWNLOAD STAFF NURSE ADDENDUM NOTIFICATION