Telangana SI Preparation Plan / తెలంగాణ ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్

Telangana SI Preparation Plan ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 సంవత్సరం ఏప్రిల్/మే నెలలో SI నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఎస్ఐ పరీక్ష సిలబస్ మరియు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ దృశ్య మీరు ఇప్పటి నుండే ఎగ్జామ్ కి సన్నద్ధం కావాలి అలా ఐతేనే మీరు సిలబస్ ను పూర్తి చేయగలుగుతారు మరియు కాంపిటీషన్  లో ఉండగలుగుతారు, అలాకాకుండా నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఇలా వెంట వెంటనే జరుగుతాయి కావున మీకు ప్రిపేర్ అవడానికి అసలు సమయం ఉండదు.పేపర్ 3 అయిన అర్థమెటిక్, రీజనింగ్ మరియు పేపర్ 4 అయిన జనరల్ స్టడీస్ పేపర్ లో 8 సబ్జెక్టులు ఇలా చాలా హెవీ కంటెంట్ ఉంటుంది, మరియు ప్రశ్నల సరళి అనేది జాతీయ పరీక్షల కు సమానంగా కఠినంగా మారింది, అందుచేత మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కనీసం ఒక్కసారి అయినా మొత్తం సిలబస్ ను చదవగలుగుతారు. మరియు నోటిఫికేషన్ తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఒకసారి మరియు ఫిజికల్ ఈవెంట్స్ సమయంలో మరొకసారి ఇలా 2 సార్లు రివిజన్ రివిజన్ చేసుకోవచ్చు అలాగే ఈవెంట్స్ పూర్తి అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేసే సమయంలో మాక్ టెస్ట్ లు రాసుకోవడం, రివ్యూ చేసుకోవడం మరియు ఎక్కడైతే మనం వీక్ గా ఉన్నామో అక్కడ సబ్జెక్టు చదువుకోవడానికి  సమయం ఉంటుంది. ఇలా మీరు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని చదివితే ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలుగుతారు అలా ఒత్తిడి లేకుండా పరీక్ష రాస్తే 5-10% మార్క్స్ మీకు తెలియకుండానే ఎక్కువ స్కోర్ చేస్తారు.

                    ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలనుకున్నా ముందుగా ఆ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ను పూర్తిగా చదవాలి మరియు ఆ సిలబస్ కి అనుగుణంగా మెటీరియల్/బుక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి మరియు గతంలో ఆ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ప్రశ్న పత్రాలను అనాలసిస్ చేసి ప్రశ్నలు ఏ సబ్జెక్టు/చాప్టర్ ఏరియా నుంచి వస్తున్నాయి ఎంత డెప్త్ తో వస్తున్నాయో తెలుసుకొని అందుకు తగిన విధంగా మన ప్రిపరేషన్ సాగిస్తే కాంపిటీటివ్ పరీక్షలలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ ఆర్టికల్ ద్వారా అసలు తెలంగాణ ఎస్సై సిలబస్ ఏ విధంగా ఉంటుంది, గతంలో జరిగిన 3 నోటిఫికేషన్ లలో ప్రిలిమినరీ మరియు మెయిన్స్ లలో అర్థమెటిక్ & రీజనింగ్ లో ఐతే ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్కులు వచ్చాయి, జనరల్ స్టడీస్ లో అయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా మార్కులు వచ్చాయి అనే వివరాలతో పాటు ప్రతి సబ్జెక్టు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలను అనుసరించి ఏ పుస్తకాల నుండి ప్రశ్నలు వస్తున్నాయో రీసెర్చ్ చేసి ప్రతి సబ్జెక్టు కి కొన్ని పుస్తకాలను మీకు సజెస్ట్ చేయడం జరిగింది, అందులో మీరు ఏదైనా ఒక పుస్తకాన్ని ఎంచుకొని దాన్ని మీరు ఒకటికి రెండుసార్లు చదివి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలను మాక్సిమమ్ ఆన్సర్ చేయగలుగుతారు. 

నోటిఫికేషన్ ప్రాసెస్

తెలంగాణ ఎస్సై నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ముఖ్యంగా 3 దశలు దాటాల్సి ఉంటుంది, అవి 

  1. ప్రిలిమినరీ పరీక్ష 
  2. ఫిజికల్ ఈవెంట్స్ 
  3. మెయిన్స్ పరీక్ష 

1. ప్రిలిమినరీ పరీక్ష ; ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో 100 ప్రశ్నలు జనరల్ స్టడీస్ నుండి అలాగే మిగతా 100 ప్రశ్నలు అర్థమెటిక్ & రీజనింగ్ నుండి వస్తాయి. ఈ ప్రిలిమినరీ పరీక్షలలో OC అభ్యర్థులు 40 % మార్కులు, BC అభ్యర్థులు 35 % మార్కులు మరియు SC, ST అభ్యర్థులు 30 % మార్కులు సాధించినట్లయితే వారు ఫిజికల్ ఈవెంట్లకి అర్హులవుతారు.

2. ఫిజికల్ ఈవెంట్స్ ; ఫిజికల్ ఈవెంట్స్ అనేవి నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ మారే అవకాశం ఉన్నది కావున ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ గురించి డీటెయిల్ గా చర్చించడం లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఫిజికల్ ఈవెంట్స్ అనేది సివిల్ విభాగానికి కేవలం క్వాలిఫై గా మాత్రమే ఉంటాయి, కేవలం మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ర్యాంకులు నిర్ణయించబడతాయి. AR, TGSP విభాగాలకు మాత్రం మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కులను 50% మరియు ఈవెంట్స్ లో వచ్చిన మార్కులను 50% గా కన్సిడర్ చేసి మెరిట్ జాబితాను రూపొందించడం జరుగుతుంది.

3. మెయిన్స్ పరీక్ష ; ఫిజికల్ ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హతను సాధిస్తారు. మెయిన్స్ అనేది మీ జాబ్ ను డిసైడ్ చేస్తుంది. అత్యధిక మార్కులు సాధిస్తే సివిల్ విభాగానికి లేదా కట్ ఆఫ్ కంటే తక్కువ మార్కులు వస్తే మెయిన్స్ లో వచ్చిన మార్కులకు ఈవెంట్స్ మార్కులు కలిపి AR, TGSP విభాగానికి నియామకం అవ్వచ్చు. మెయిన్స్ పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ 1&2 అనేవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్ లో పరిగణనలోకి తీసుకోరు. కేవలం పేపర్ 3&4 లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. కానీ పేపర్ 1&2 క్వాలిఫై అయితేనే పేపర్ 3&4 లను వ్యాలిడేషన్ చేస్తారు.

  • PAPER 1 (ENGLISH) ;  పేపర్ 1 అయిన జనరల్ ఇంగ్లీష్ అనేది కేవలం క్వాలిఫైడ్ పేపర్ మాత్రమే ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్ లో కన్సిడర్ చేయరు. పేపర్ 1 అయిన జనరల్ ఇంగ్లీష్ 100 మార్కులకు జరుగుతుంది, ఇందులో రెండు విభాగాలు ఉంటాయి
  • TELANGANA SI ENGLISH
  • 👉🏻ఈ పేపర్లో 100 మార్కులకు గాను అన్ రిజర్వుడు అభ్యర్థులు 40 మార్కులు, బీసీ అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సీ ఎస్టీ మరియు మాజీ సైనిక ఉద్యోగులు 30 మార్కులు సాధిస్తే ఈ పేపర్ లో క్వాలిఫై అవుతారు.
  • PAPER 2 (TELUGU) ; పేపర్ 1 మాదిరి పేపర్ 2 అయిన తెలుగు/ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ అనేది కేవలం క్వాలిఫైడ్ పేపర్ మాత్రమే ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్ లో కన్సిడర్ చేయరు. ఈ పేపర్ 2 కూడా 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది, ఇందులో రెండు విభాగాలు ఉంటాయి.TELANGANA SI TELUGU
  • 👉🏻ఈ పేపర్లో 100 మార్కులకు గాను అన్ రిజర్వుడు అభ్యర్థులు 40 మార్కులు, బీసీ అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సీ ఎస్టీ మరియు మాజీ సైనిక ఉద్యోగులు 30 మార్కులు సాధిస్తే ఈ పేపర్ లో క్వాలిఫై అవుతారు.
  • PAPER 3 (Arithmetic & Reasoning) ; ఎస్సై పరీక్షలో విజయం సాధించాలంటే పేపర్ 3 అయినా అర్థమెటిక్ మరియు రీజనింగ్ పేపర్ చాలా కీలకమైనది. ఈ పేపర్లో మీరు వీలైనంత ఎక్కువ స్కోరు చేస్తే మీ యొక్క కాంపిటీషన్స్ లో ముందు ఉంటారు. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినట్లయితే ప్రీవియస్ గా జరిగిన 3 నోటిఫికేషన్ యొక్క ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్ష పేపర్లను చూసి ఆ స్టాండర్డ్ కి అనుగుణంగా బుక్స్ ను ఎంపిక చేసుకొని రోజు ప్రాక్టీస్ చేయాలి. అలాగే నాన్ మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన స్టూడెంట్స్ ఈ పేపర్ ను చూసి భయపడకుండా ఎలా ముందుకు పోవాలి అని ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎస్ఐ జాబ్ సాధించడానికి వచ్చారు , ఎస్ఐ జాబ్ సాధించాలంటే అందులో ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ కూడా ఒక భాగం అందుకని ముందుగా మీరు బేసిక్స్ పైన పట్టు సాధించాలి. అనగా 20 వరకు టేబుల్స్, 30 వరకు వర్గాలు, 30 వరకు ఘనాలు, కూడికలు,తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు మరియు కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపుల్స్ పై పట్టు సాధించి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ లో చెప్పిన ప్రతి అంశాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కూడా ఈ పేపర్ లో మంచి స్కోర్ చేయగలుగుతారు.
  • పేపరు 3 సిలబస్ Telangana SI arithmetic
  • గత 3 నోటిఫికేషన్స్ ప్రకారం వెయిటేజ్ మార్కులు చూసినట్లయితే రీజనింగ్ నుండి యావరేజ్ గా 90 మార్కులు వస్తున్నాయి, అలాగే ఆర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ నుండి 110 మార్కులు వస్తున్నాయి. 2025 లో వచ్చే నోటిఫికేషన్ లో కూడా వెయిటేజ్ ఇలాగే ఉండవచ్చు లేదా 5-10 మార్కులు చేంజ్ అవ్వొచ్చు.
  • PAPER 4 (General Studies) ;  పేపర్ 4 అయిన జనరల్ స్టడీస్ చాలా విసృతమైనది. మొత్తం 8 సబ్జెక్టులు ఉంటాయి , ప్రతి సబ్జెక్టు కూడా కీలకమే కానీ గత ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే ప్రతి సబ్జెక్టు కు కొంత వెయిటెజ్ ఉంది ఆ వెయిటెజ్ కి అనుగుణంగా బుక్స్ ను ఎంపిక చేసుకొని చాలా సెలెక్టివ్ గా చదవాలి. అంటే ప్రతి సబ్జెక్టు కి వెయిటెజ్ బట్టి ఒక్క స్టాండర్డ్ బుక్ సెలెక్ట్ చేసుకొని దానినే ఒకటికి 10 సార్లు చదవాలి. ముందుగా పేపర్ 4 సిలబస్ చూద్దాం, ఆతర్వాత గత నోటిఫికేషన్ ప్రకారం సబ్జెక్టు వైజ్ మార్కుల వెయిటెజ్ మరియు ప్రతి సబ్జెక్టు కు సంబంధించి మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ గురించి చూద్దాం.
  • పేపరు 4 సిలబస్ Telangana SI Gs
  • సబ్జెక్టు వైజ్ మార్కుల వెయిటెజ్ (content Will be update soon)

 

స్టాండర్డ్ బుక్స్ : 

  1. అర్థమెటిక్ ; ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుని అదే ఇన్స్టిట్యూట్ నిర్వహించి మాక్ టెస్ట్ లను క్రమం తప్పకుండా రాయడం. ఆ ఆ పరీక్షలలో 90% కంటే ఎక్కువ ప్రశ్నలు సాల్వ్ చేస్తున్నారంటే అప్పుడు పోలీస్ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే ఇతర ఇన్స్టిట్యూట్ ల ప్రశ్న పత్రాలను లేదా SSC CGL , RRB నిర్వహించే పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను  ప్రాక్టీస్ చేసిన అర్థమెటిక్ లో ఎక్కువ మార్కులు సాధించగలరు.
  2. రీజనింగ్ ; రీజనింగ్ విభాగం లో ప్రశ్నలు అనేవి మీ యొక్క ఆలోచన పరిధిని తెలుసుకోవడం కోసం అడగడం జరుగుతుంది. CALENDAR, CLOCKS, DICE, INEQUALITIES, CUBES ext… కొన్ని చాప్టర్ లలో మాత్రమే స్టాక్ కంటెంట్ ఉంటుంది. మిగతా రీజనింగ్ విభాగం అంత ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మరియు కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి. అందుకని రీజనింగ్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ పైన లేదా ఒక బుక్కు పైన కాకుండా, బేసిక్స్ సబ్జెక్టు నేర్చుకుని ఆ తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పరిధిలో లభించే ప్రతి ప్రశ్నను మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి, అలా చేస్తుంటేనే మీ యొక్క ఆలోచన పరిధి పెరుగుతుంది. తద్వారా రీజనింగ్ ప్రశ్నలను సులభంగా అలాగే ఎక్కువ స్కోరు చేయగలుగుతారు.
  3. జనరల్ సైన్స్ ; విన్నర్స్ పబ్లికేషన్ లేదా MC రెడ్డి పబ్లికేషన్ 
  4. కరెంట్ అఫైర్స్ మరియు అంతర్జాతీయ సంబంధాలు ; డైలీ ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఒక నోట్స్ రాసుకోవాలి. మరియు ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ను ఫాలో అవ్వాలి.
  5. ఇండియన్ హిస్టరీ ; సీనయ్య సార్, కరీం సర్, జోగి నాయుడు సార్, సయీద్ సర్ బుక్ లలో ఏదైనా ఒక బుక్. బేసిక్స్ కావాలంటే డిగ్రీ లో BA మొదటి మరియు 2 వ సంవత్సరం తెలుగు అకాడమి ఇండియన్ హిస్టరీ బుక్స్.
  6. జాగ్రఫీ (ఇండియన్, తెలంగాణ & ప్రపంచ) ; విన్నర్స్ పబ్లికేషన్, MC రెడ్డి పబ్లికేషన్ లేదా ఆనంద్ సర్ రాసిన పుస్తకం లలో ఏదైనా ఒకటి.
  7. ఇండియన్ పొలిటీ ; లక్ష్మీకాంత్ 7వ ఎడిషన్ లేదా విన్నర్స్ పబ్లికేషన్ 
  8. ఎకానమీ ; తెలుగు అకాడమీ ప్రచురించిన ఇండియన్ ఎకానమీ పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పుస్తకం నుండి బేసిక్స్. కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ & సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ లను చదువుకుంటే సరిపోతుంది.
  9. తెలంగాణ మూవ్మెంట్ మరియు రాష్ట్ర ఆవిర్భావం ; తెలుగు అకాడమీ ప్రచురించిన తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం లేదా PNR పబ్లికేషన్ బుక్ లేదా రఘు దేపాక సార్ బుక్ లలో ఏదైనా ఒకటి.

 

ప్రీవియస్ ప్రశ్న పత్రాలు (content Will be update soon)

 

 

 

తెలంగాణ ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్ 

Leave a Comment