Telangana lab technician notification ; తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో గల ఉద్యోగాల భర్తీ కోసం మొదటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 1284 పోస్టులలో తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో గల వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకోండి.
ముఖ్యమైన తేదీలు ;
- అప్లికేషన్ లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకుంటారు.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది 21.9.2024
- ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేది 5.10.2024 ( 5 pm )
- అప్లికేషన్ లో జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం 7.10.2024 ( 10 Am ) To 8.10.2024 ( 5 pm )
- పరీక్ష తేది 10.11.2024
ఖాళీల వివరాలు & పే స్కేల్
సెలక్షన్ ప్రోసెస్
- మొత్తం 100 పాయింట్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది
- 80 % మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు, ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
- తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో / ఇనిస్టిట్యూట్ / ప్రోగ్రములలో కాంట్రాక్టు ప్రాతిపదికన లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వారి సర్వీస్ ఆధారంగా గరిష్ఠంగా 20 % మార్కులను కేటాయిస్తారు.
అర్హతలు
- క్రింద తెలిపిన ఏదైనా ఒక క్వాలిఫికేషన్ లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- అభ్యర్థులు తమ అప్లికేషన్ సమర్పించే నాటికి తప్పనిసరిగా తెలంగాణ పారా మెడికల్ బోర్డు లో రిజిస్టర్ అయి ఉండాలి
వయస్సు
- అభ్యర్థులు 01.07.2024 నాటికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి
- గరిష్ట వయస్సు విషయంలో క్రింద ఇవ్వబడిన వర్గాల వారికి మినహాయింపు కలదు
ఫీజు వివరాలు
- అప్లయ్ చేసే ప్రతి అభ్యర్థి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపాయలు చెల్లించాలి.
- ఎగ్జామినేషన్ ఫీజు తో పాటు ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఐతే తెలంగాణకు చెందిన SC, ST, BC, EWC, PH మరియు Ex Service men కు చెందిన అభ్యర్థులకు ఈ ప్రాసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
సిలబస్ & పరీక్ష విధానం
- ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది
- మొత్తం 80 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి
- కంప్యూటర్ ఆధారిత విధానంలో ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎంపిక చేయబడిన 13 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తారు
- డిప్లొమా స్టాండర్డ్ లో CLINICAL BIOCHEMISTRY, CLINICAL MICROBIOLOGY, PATHALOGY సిలబస్ లో 80 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ( పూర్తి సిలబస్ కోసం నోటిఫికేషన్ ను చూడండి )
పరీక్షా కేంద్రాలు
- మొత్తం 13 ప్రాంతాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది
- హైదరాబాద్
- వరంగల్
- కరీంనగర్
- నల్గొండ
- ఖమ్మం
- అదిలాబాద్
- మహబూబ్ నగర్
- నిజామాబాద్
- కోదాడ
- కొత్తగూడెం
- సత్తుపల్లి
- సంగారెడ్డి
- నర్సంపేట
జోనల్ వైజ్ ఖాళీల వివరాలు
CLICK HERE TO DOWNLOAD TELANGANA LAB TECHNICIAN NOTIFICATION
All THE BEST
1 thought on “1284 పోస్టులతో టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల / GovtJobPreparation.com”
Comments are closed.