NHRC నూతన చైర్మన్ గా జస్టిస్ V. రామ సుబ్రమణీయన్ నియమితులయ్యారు.
- ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
- సుప్రింకోర్టు సాదారణ న్యాయమూర్తిగా 29 జూన్ 2023 రిటైర్డు అయ్యారు.
- 23 డిసెంబర్ 2024 రోజున NHRC కి ఛైర్మన్ గా నియమించబడ్డారు.
- ఇతను NHRC కి 9 వ అధ్యక్షుడు.
- చైర్మన్ తో పాటు నూతనంగా మరో ఇద్దరు సభ్యులు కూడా నియమించడం జరిగింది. 1. ప్రియాంక్ కానుంగో 2. బిద్యుత్ రంజన్ సారంగి.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ;
- ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వ తారీకులు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గా జరుపుకుంటారు.
- 1991 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి దేశం కూడా తమ దేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయాలని ఐరాస పిలుపునివ్వడం జరిగింది.
- సెప్టెంబర్ 27 1993 న భారత రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు, 1993 అక్టోబర్ 12 నుంచి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది.
- డిసెంబర్ 18, 2024 ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ (PHRA) 1993 ద్వారా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది.
- నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక చైర్మన్, 5 గురు సభ్యులు మరియు 7 గారు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు.
- NHRC చైర్మన్గా నియమించబడాలంటే అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసి ఉండాలి లేదా హైకోర్టు జడ్జి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసి అయినా ఉండాలి
- NHRC ఇతర సభ్యులుగా నియమించబడేవారు (1) సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి లేదా సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి. (2) హైకోర్టు లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి లేదా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి. (3) మిగతా ముగ్గురు సభ్యులు మానవ హక్కులకు సంబంధించిన రంగంలో విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అయితే ఈ ముగ్గురిలో ఒక మహిళ ఉండాలి.
- 7 గురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా (1) నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్. (2) నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్. (3) నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. (4) నేషనల్ మైనార్టీ కమిషన్ చైర్మన్ (5) నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్. (6) నేషనల్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ కమిషన్ చైర్మన్. (7) కమిషనర్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబులిటీ
- NHRC చైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతికి సూచించడానికి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, ఈ స్క్రీనింగ్ కమిటీ లో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ మరియు 5 గురు ఇతర సభ్యులు ఉంటారు. చైర్మన్ గా ప్రధానమంత్రి మరియు సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు కేంద్ర హోం శాఖ మంత్రి.
- చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు లేదా అతనికి 70 సంవత్సరాలు నిండే వరకు.
- NHRC కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి
- మానవ హక్కులకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను లేదా తానే స్వయంగా సుమోటోగా కూడా స్వీకరిస్తుంది
- వీరి యొక్క జీతభత్యాలను రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారు
- సంవత్సరం లోపు జరిగిన అంశాలను మాత్రమే NHRC విచారణ చేస్తుంది, ఒక సంవత్సర కంటే ఎక్కువ వ్యవధి అయిన అంశాలను ఇది విచారించదు.
- NHRC ప్రతి సంవత్సరం తన నివేదిక ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది, అయితే ఇది కేవలం సలహా పూర్వకమైనది మాత్రమే , NHRC ఇచ్చిన రిపోర్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పిస్తుంది.
- చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు
- జస్టిస్ రంగనాథ్ మిశ్రా
- జస్టిస్ వెంకట చలయ్య
- జస్టిస్ K.S. వర్మ
- జస్టిస్ A.S. ఆనంద్
- జస్టిస్ S. రాజేంద్ర బాబు
- జస్టిస్ K.G. బాలకృష్ణన్
- జస్టిస్ H.L. దత్తు
- జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
- జస్టిస్ V. రామ సుబ్రమణీయన్
#NHRC
#NHRC_NEW_CHAIRMAN