కేంద్ర ప్రభుత్వం & మంత్రి మండలి / Central Cabinet / GovtJobPreparation.com

కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వం & మంత్రి మండలి; జూన్ 09th 2024 న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో NDA కూటమి 293 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్ల సంఖ్యను సాధించింది. ఆ తర్వాత NDA పక్షనేతగా వరసగా 3వ సారి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సమక్షంలో ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు, నరేంద్ర మోడీతో పాటు మరొక 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, మొత్తంగా 72 మందితో కేంద్ర మంత్రి మండలి ఏర్పడింది.

  • 71 మంత్రులలో  30 మందికి క్యాబినెట్ హోదా, 5గురికి స్వతంత్ర హోదా, మిగతా 36 మంది సహాయ మంత్రులుగా ఉంటారు.
  • రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంత్రులకు అవకాశం కలదు.
  • భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తర్వాత వరసగా 3వ సారి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నరేంద్ర మోడీదే.
  • రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుండి 10 మంది, తర్వాత బీహార్ నుండి 08, మహరాష్ట్ర నుండి 06, మధ్య ప్రదేశ్ & రాజస్థాన్ నుండి 05, గుజరాత్ & కర్ణాటక నుండి 04, అంధ్రప్రదేశ్&తమిళనాడు&హర్యానా నుండి 03, తెలంగాణ&పంజాబ్&పశ్చిమబెంగాల్&జార్ఖండ్&కేరళ&అస్సాం&ఒడిస్సా రాష్ట్రాలకు ఇద్దరు చొప్పున, ఢిల్లీ&హిమాచల్ ప్రదేశ్&గోవా&అరుణాచల్ ప్రదేశ్&జమ్మూ కాశ్మీర్ నుండి ఒక్కరు చొప్పున కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
  • రాష్ట్రాలకు CM లుగా పనిచేసి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారు ప్రదనితో కలుపుకొని(07); నరేంద్ర మోడీ (Gujarath), శివరాజ్ సింగ్ చౌహాన్(Madhya Pradesh), రాజ్నాథ్ సింగ్(Uthar Pradesh), మనోహార్ లాల్ ఖట్టర్(Haryana), సర్బానంద సొనోవాల్(Assam), H D కుమారస్వామి(Karnataka), జితిన్ రామ్(Bihar).
  • మోడి3.0 లో 7 గురు మహిళలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, వారు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణ దేవి, అనుప్రియ పటేల్, శోభ కరడ్లజీ, సావిత్రి ఠాకూర్, రక్షా కడ్సే & నిముబిన్ జయంతిభాయ్.
  • మంత్రివర్గంలో 27 మంది OBC, 10 మంది SC, 05గురు ST లు కాగా ముస్లింలు ఒక్కరు కూడా లేరు.
  • కేంద్ర మంత్రివర్గంలో అతి పిన్న వయస్కులు రామ్మోహన్ నాయుడు(AP), రక్షా కద్గె(MH) వీరికి 37 సంవత్సరాలు.
  • కేంద్ర మంత్రివర్గంలో అతిపెద్ద వయస్కుడు జితిన్ రామ్ మంఘి(79 సంవత్సరాలు).

 

కేంద్రమంత్రి, ఎన్నికైన నియోజకవర్గం & కేటాయించబడిన మంత్రిత్వ శాఖ;
  1. నరేంద్ర మోడీ ; ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, అంతరిక్షం, అణు ఇంధనం, మంత్రులకు కేటాయించబడని ఇతర మంత్రిత్వ శాఖలు
కేబినెట్ మంత్రులు:
  1. రాజ్ నాథ్ సింగ్ ; రక్షణశాఖ
  2. అమిత్ షా.      ; హోంశాఖ, సహకారం
  3. నితిన్ గడ్కరీ ; జాతీయ రహదారులు,రవాణా
  4. JP నడ్డా; వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  5. శివరాజ్ సింగ్ చౌహన్; గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం-రైతు సంక్షేమం
  6. నిర్మల సీతారామన్ ; ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
  7. సుబ్రహ్మణ్య జయశంకర్; విదేశీ వ్యవహారాలు
  8. మనోహర్ లాల్ ఖట్టర్; పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖ
  9. HD కుమారస్వామి; భారీ పరిశ్రమలు, ఉక్కు
  10. పీయూష్ గోయల్; వాణిజ్యం,పరిశ్రమలు
  11. ధర్మేంద్ర ప్రధాన్; విద్యాశాఖ
  12. జితన్ రామ్ మాంజి; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
  13. రాజీవ్ రంజన్ సింగ్; పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశుసంవర్ధకం
  14. సర్భానంద సోనోవాల్; నౌకాశ్రయలు,జల రవాణా
  15. వీరేంద్ర కుమార్; సామాజిక న్యాయం,సాధికారత
  16. కింజారపు రామ్మోహన్ నాయుడు; పౌర విమానయానం
  17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి; వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, పునరుత్పాదక ఇంధనం
  18. జాయోల్ ఓరం; గిరిజన వ్యవహారాలు
  19. గిరిరాజ్ సింగ్; జౌళి శాఖ
  20. అశ్విని వైష్ణవ్; రైల్వే శాఖ, సమాచార-ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, IT శాఖ
  21. జ్యోతిరాదిత్య  సింధియా; టెలికాం-కమ్యూనికేషన్లు శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  22. భూపేంద్ర యాదవ్; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు
  23. గజేంద్ర సింగ్ షెఖావత్; పర్యాటకం, సాంస్కృతిక శాఖ
  24. అన్నపూర్ణాదేవి; శిశు సంక్షేమ శాఖ
  25. కిరణ్ రిజిజు; పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాల శాఖ
  26. హర్దీప్ సింగ్ పూరి; పెట్రోలియం, సహజవాయువు
  27. మన్సుఖ్ మాండవీయ; కార్మిక-ఉపాధి శాఖ, యువజన, క్రీడా శాఖ
  28. గంగాపురం కిషన్ రెడ్డి; బొగ్గు-గనుల శాఖ
  29. చిరాగ్ పాస్వాన్; ఆహార శుద్ధి పరిశ్రమలు
  30. CR పటేల్; జల శక్తి 

 

స్వతంత్ర హోదా గల మంత్రులు

  1. రావు ఇంద్రజిత్ సింగ్; గణాంకాలు, ప్రణాళిక శాఖ(స్వతంత్ర), సంస్కృతి (సహాయ మంత్రి)
  2. జితేంద్ర సింగ్; ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలు, అణు ఇంధనం-అంతరిక్షం(సహాయం మంత్రి), శస్త్ర సాంకేతికం-భూవిజ్ఞానం (స్వతంత్రం)
  3. అర్జున్ రామ్ మేఘ వాల్;న్యాయం(స్వతంత్ర), పార్లమెంటల్ వ్యవహారాలు (సహాయం మంత్రి)
  4. ప్రతాప్ రావు గణపతి రావు జాదవ్; ఆయుష్ (స్వతంత్ర), వైద్య-ఆరోగ్యం (సహాయం మంత్రి)
  5. జయంత్ చౌదరి; నైపుణ్య అభివృద్ధి (స్వతంత్ర), విద్య (సహాయ మంత్రి)

 

సహాయ మంత్రులు

  1. జీతిన్ ప్రసాద్; వాణిజ్యం-పరిశ్రమలు
  2. శ్రీపాద యశోనాయక్; ఇందులో, పునరుత్పాదక విద్యుత్
  3. పంకజ్ చౌదరి; ఆర్థికం
  4. క్రిస్టియన్ పాల్; సహకారం
  5. రాందాస్ ఆరావలె; సామాజిక న్యాయం, సాధికారికత
  6. రామ్ నాథ్ ఠాకూర్; వ్యవసాయం, రైతు సంక్షేమం
  7. నిత్యానంద రాయ్; హోం శాఖ
  8. అనుప్రియ పటేల్; వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  9. V సోమన్న- జలశక్తి, రైల్వే
  10. పెమ్మసాని చంద్రశేఖర్; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
  11. SP సింగ్ బఘెల్; మత్స్య, పాడి, పశుసంవర్ధకం, పంచాయతీ రాజ్
  12. శోభ కరంథ్లాజే; MSME, కార్మిక-ఉపాధి శాఖ
  13. కీర్తి వర్ధన్ సింగ్; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ వ్యవహారాలు
  14. BL వర్మ; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం-సాధికారికత
  15. శాంతను ఠాకూర్; పోర్టులు-నౌకాయానం, జల రవాణా
  16. సురేష్ గోపి; సహజవాయువు-పెట్రోలియం, పర్యాటకం
  17. L మురుగన్; సమాచార-ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు
  18. అజయ్ టాంటా; రహదారి రవాణా, జాతీయ రహదారులు
  19. బండి సంజయ్; హోంశాఖ
  20. కమలేష్ పాష్వాన్; గ్రామీణ అభివద్ధి
  21. భగీరథ చౌదరి; వ్యవసాయం-రైతు సంక్షేమం
  22. సతీష్ చంద్ర దూబే; బొగ్గు-గనులు
  23. సంజయ్ సేథ్; రక్షణ
  24. రవ్ నిత్ సింగ్ బిటూ; రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమలు
  25. దుర్గా దాస్ ఉయికే; గిరిజన వ్యవహారాలు
  26. రక్ష నిఖిల్ ఖడ్సే; క్రీడలు, యువజన వ్యవహారాలు
  27. సుఖాంత మజుందార్; విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  28. సావిత్రి ఠాగూర్; మహిళా-శిశు సంక్షేమం
  29. టోకన్ సాహు; గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
  30. రాజ భూషణ్ చౌదరి; జలశక్తి
  31. భూపతి రాజు శ్రీనివాస శర్మ; ఉక్కు-భారీ పరిశ్రమలు
  32. హర్ష మల్హోత్రా; కార్పొరేట్ వ్యవహారాలు, రవాణా-జాతీయ రహదారులు
  33. నిముబెన్ జయంతి బాయ్ బాంబనియా; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ వ్యవస్థ
  34. మురళీధర్ మొహల్; పౌర విమానయానం, సహకారం
  35. జార్జ్ కురియన్; మత్స్య-పాడి-పశుసంవర్ధకం, మైనారిటీ వ్యవహారాలు
  36. పబిత్ర మార్గరీట; విదేశీ వ్యవహారాలు, జోలి పరిశ్రమ