ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2023 ను మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫారెస్టీ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు 21 డిసెంబర్ 2024 రోజున విడుదల చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ రిపోర్టును తయారు చేస్తారు. 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్టును విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన రిపోర్టు 18 వ రిపోర్ట్. అటవీ విస్తీర్ణం, చెట్ల విస్తీర్ణం, మడ అడవుల విస్తీర్ణం, కార్చిచ్చు ద్వారా జరిగిన నష్టం మొదలైన అంశాల గురించి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ రిపోర్టును రూపొందించడం జరుగుతుంది.
ఫారెస్ట్ రిపోర్టు 2023 ముఖ్యంశాలు ;
- మొత్తం అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు, ఈ విస్తీర్ణం భారతదేశ మొత్తం విస్తీర్ణంలో 21.76%.
- మొత్తం చెట్ల విస్తీర్ణం 1,12,014 చదరపు కిలోమీటర్లు, ఈ విస్తీర్ణం భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 3.41%.
- మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు, ఈ విస్తీర్ణం భారతదేశ మొత్తం విస్తీర్ణంలో 25.17%.
- 2021 రిపోర్టుతో పోల్చినప్పుడు అటవిమరియు చెట్ల విస్తీర్ణం 1445 చదరపు కిలోమీటర్లు విస్తరించడం జరిగింది, ఇందులో అటవీ విస్తీర్ణం 156 చదరపు కిలోమీటర్లు మరియు చెట్ల విస్తీర్ణం 1289 చదరపు కిలోమీటర్లు పెరగడం జరిగింది.
- మడ అడవుల విస్తీర్ణం 4991 చదరపు కిలోమీటర్లు అయితే 2021 తో పోలిస్తే 7.43 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం తగ్గింది
- మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 1. పశ్చిమ బెంగాల్ 2. గుజరాత్ 3. అండమాన్ నికోబార్ దీవులు 4. ఆంధ్రప్రదేశ్ 5. మహారాష్ట్ర
- కార్చిచ్చుల వల్ల అటవీ విస్తీర్ణం ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రాలు 1. ఉత్తరఖండ్ 2. ఒడిస్సా 3.ఛత్తీస్ ఘడ్
- బ్యాంబు విస్తీర్ణం 1,54,670 చదరపు కిలోమీటర్లు
- 7285 మిలియన్ టన్నులు కార్బన్ స్టాక్ ఉన్నది. 2021 తో పోల్చితే ఇది 81.5 మిలియన్ టన్నులు పెరిగింది. ఈ కర్బన ఉద్గారాలు అత్యధికంగా తగ్గుతున్న రాష్ట్రాలు వరుసగా 1. అరుణాచల్ ప్రదేశ్ 2. మధ్యప్రదేశ్ 3. ఛత్తీస్ ఘడ్
- భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలు వరుసగా 1. మిజోరాం (242 చదరపు కిలోమీటర్లు) 2. గుజరాత్ (180 చదరపు కిలోమీటర్లు) 3. ఒడిశా (152 చదరపు కిలోమీటర్లు)
- అటవీ విస్తీర్ణం ఎక్కువగా తగ్గిన రాష్ట్రాలు వరుసగా 1. మధ్య ప్రదేశ్ (612 చదరపు కిలోమీటర్లు) 2. కర్ణాటక (459 చదరపు కిలోమీటర్లు) 3. లడక్ (159 చదరపు కిలోమీటర్లు)
- భారతదేశంలో అడవి మరియు చెట్ల విస్తీర్ణం పరంగా ఎక్కువ పెరిగిన రాష్ట్రాలు వరుసగా 1. ఛత్తీస్ ఘడ్ (684 చదరపు కిలోమీటర్లు), 2. ఉత్తర ప్రదేశ్ (559 చదరపు కిలోమీటర్లు), 3.ఒడిశా (559 చదరపు కిలోమీటర్లు), 4. రాజస్థాన్ (394 చదరపు కిలోమీటర్లు).
- 33% కంటే ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 1.లక్షద్విప్ 2. మిజోరం 3. అండమాన్ నికోబార్ దీవులు 4. అరుణాచల్ ప్రదేశ్ 5. నాగాలాండ్ 6. మేఘాలయ 7. త్రిపుర 8. మణిపూర్
- అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 1. మధ్యప్రదేశ్ (77,073 చదరపు కిలోమీటర్లు), 2. అరుణాచల్ ప్రదేశ్ (65,882 చదరపు కిలోమీటర్లు) 3. ఛత్తీస్ ఘడ్ (55,812 చదరపు కిలోమీటర్లు)
- అటవీ విస్తీర్ణం శాత పరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 1. లక్షద్విప్ (91.33%), 2. మిజోరం (85.34%), 3. అండమాన్ మరియు నికోబార్ దీవులు(81.63%)
- అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా 2. మధ్యప్రదేశ్ (85,725 చదరపు కిలోమీటర్లు) 2. అరుణాచల్ ప్రదేశ్ (67,083 చదరపు కిలోమీటర్లు), 3. మహారాష్ట్ర (65,383 చదరపు కిలోమీటర్లు)