Current Affairs In Telugu / 16-31 October 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా అక్టోబరు నెల 16 తారీకు నుండి 31 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024
- ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత మాజీ మహిళా స్పిన్నర్ నీతూ డేవిడ్ కు చోటు లభించింది, డయాన ఎడుల్జి తర్వాత ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న రెండో మహిళగా నీతూ డేవిడ్ నిలిచింది.
- నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈమె వన్డేల 147 వికెట్లు తీసుకున్నారు, భారత్ తరపున వన్డే క్రికెట్ లో 100 వికెట్లు తీసుకున్న తొలి మహిళ క్రికెటర్ గా ఈమెకు రికార్డు కలదు.
- నీతూ డేవిడ్ తో పాటు ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికా క్రికెటర్ Ab డివిలియర్స్ మరియు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ లకు కూడా చోటు లభించింది.
- ఇప్పటివరకు 115 మందికి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు లభించింది.
- Federation of international cricketers association (FICA) తో కలిసి సంయుక్తంగా January 02 2009 రోజున ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్స్ గౌరవార్థం ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ను ప్రారంభించింది, ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినా 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇందులో చోటు కల్పిస్తారు.
- 2023 సంవత్సరంలో శ్రీలంక నుండి డి సిల్వా, భారత్ నుండి వీరేంద్ర సెహ్వాగ్ మరియు డయాన ఎడుల్జి లు చోటు లభించింది.
- భారత్ నుండి ఇద్దరు మహిళా క్రికెటర్లు మరియు ఎనిమిది మంది పురుష క్రికెటర్లు ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు పొందారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా
- ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచుడ్ నవంబర్ 10 2024 రోజున పదవి విరమణ చేయనున్నారు, అందుచేత ప్రస్తుతం సుప్రింకోర్టు లో తన తర్వాత అత్యంత సీనియర్ అయిన్ సంజీవ్ ఖన్నా పేరును తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
- సంజీవ్ కన్నా నవంబర్ 11 2024 నుండి మే 13 2025 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు నిర్వహించనున్నారు
- సంజీవ్ కన్నా 51 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్మన్ గా విజయ కిషోర్ రహాత్కర్
- తొమ్మిదో జాతీయ మహిళ కమిషన్ చైర్మన్గా విజయ కిషోర్ రహత్కర్ 19 అక్టోబర్ 2024 రోజున నియమితులయ్యారు.
- ఈమె 2016-21 మధ్యకాలంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గారు సేవలందించారు. ఆ సమయంలో యాసిడ్ దాడి బాధితుల కోసం sakshama, మహిళా స్వయం సహాయక సంఘాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసేందుకు prajwala, మహిళల కోసం 24 గంటలు సహాయం అందించేందుకు suhitha Helpline అనే పథకాలను అమలు చేశారు.
- మహిళల న్యాయ పరమైన హక్కులపై విధి లిఖిత్ అనే బుక్ ను వ్రాసారు.
- మహిళా సాధికారికత కోసం ఈమె చేసిన కృషి గాను జాతీయ న్యాయ పురస్కారం, సావిత్రిబాయి పులే పురస్కారం ( జాతీయ సాహిత్య మండలి ఇస్తుంది ) మొదలైనవి పురస్కారాలను అందుకున్నారు.
రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఘన శ్యామ్ తివారీ
- రాజ్యసభ ఎథిక్స్ / నైతిక విలువల కమిటీ చైర్మన్ గా ఘన శ్యామ్ తివారీ నియమితులయ్యారు.
- చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులుగా Y. విజయ సాయి రెడ్డి, ప్రమోద్ తివారీ, డెరెక్ ఒబ్రియాన్, తిరుచ్చి శివ, సంజయ్ సింగ్, శస్మిత్ పాత్రా, ప్రేమ్ చంద్ గుప్తా, మేధ విశ్రమ్ కులకర్ణి మరియు దర్శాన సింగ్ నియమితులయ్యారు.
- రాజ్యసభ ఎంపీల ప్రవర్తన నియమాలకు సంబంధించి ఫిర్యాదులను ఈ కమిటీ పరిష్కరిస్తుంది.
APPSC చైర్మన్ గా అనురాధ నియామకం
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ IPS అధికారి అనురాధ గారు నియమితులయ్యారు.
- అనురాధ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు ఉన్నది.
జాతీయ జల పురస్కారాలు 2024
- 5 వ జాతీయ జల పురస్కారాలు 23 అక్టోబర్ 2024 రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది
- ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో ఒడిశా, ఉత్తర ప్రదేశ్ మొదటి రెండు స్థానాలలో నిలువగా పుదుచ్చేరి మరియు గుజరాత్ లు సంయుక్తంగా 3 వ స్థానంలో నిలిచాయి.
- ఉత్తమ జిల్లాల కేటగిరి లో South Zone నుండి విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), North Zone నుండి సంయుక్తంగా బందా (ఉత్తరప్రదేశ్) మరియు గండేర్బల్ (జమ్ము కాశ్మీర్), North East Zone నుండి దలై (త్రిపుర), West Zone నుండి ఇండోర్ (మధ్యప్రదేశ్), East Zone నుండి బలంగిర్ (ఒడిశా) మొదటి స్థానంలో నిలిచాయి
- ఉత్తమ గ్రామపంచాయతీ విభాగంలో పుల్లాంబర-తిరువనంతపురం-కేరళ, మసూల్పాని- కాంకేర్-చత్తీస్ ఘడ్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా హంసపూర్-అనంతపురం-ఆంధ్రప్రదేశ్ మరియు క్లీహ్రాగ్న-వెస్ట్ జైంతియా హిల్స్-మేఘాలయ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.
మహిళల T20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్
- దుబాయిలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి, పురుషులు మరియు మహిళల విభాగంలో న్యూజిలాండ్ తొలిసారిగా టి20 ప్రపంచకప్ ను గెలుచుకుంది.
- న్యూజిలాండ్ కు చెందిన అమేలియా కెర్ కు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
- ప్రపంచ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారితో ఐసీసీ తమ జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు అయిన న్యూజిలాండ్ నుండి అమేలియ కేర్, రోజ్ మేరీ, ఈడెన్ కార్సాన్ (12 వ ప్లేయర్), సౌత్ ఆఫ్రికా నుండి లారా వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, ఎంలబా, ఇంగ్లాండ్ నుండి డాని వ్యాట్, వెస్టిండీస్ నుండి డేండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, ఆస్ట్రేలియా నుండి మెగాన్ షాట్, బంగ్లాదేశ్ నుండి నిగర్ సుల్తానా, ఇండియా నుండి హర్మన్ ప్రీత్ కౌర్ మొదలైన ప్లేయర్లు ప్రపంచ కప్ లో చేసిన ఉత్తమ ప్రదర్శన కారణంగా ఐసిసి టీమ్ ఆఫ్ టి20 వరల్డ్ కప్ 2024 లో చోటు దక్కించుకున్నారు
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు 10 క్రీడలతో
- 2026 లో జరిగే గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల రోస్టర్ నుండి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్కాష్ మరియు ట్రయత్లా క్రీడలను తొలగించారు
- ఖర్చు తగ్గించుకోవడం కోసం కేవలం 10 క్రీడలలో మాత్రమే గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
- 2022 లో జరిగిన బర్నింగ్ హోం కామన్వెల్త్ క్రీడలలో 19 క్రీడలలో ఈ పోటీలను నిర్వహించారు.
- గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, సైక్లింగ్, పారా సైక్లింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, పోరా పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, నెట్ బాల్, జూడో, బౌల్స్, పారా బౌల్స్, 3×3 బాస్కెట్ బాల్, 3×3 వీల్ చైర్ బాస్కెట్ బాల్ మొదలైన 10 క్రీడాంశాల్లో పోటీలో జరగనున్నాయి.
ఇతర ముఖ్యాంశాలు ;
- దేశంలో అత్యంత ధనవంతులు అయిన 100 మంది వ్యక్తులతో కూడిన జాబితాలో ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ముఖేష్ అంబానీ ( 119.5 బిలియన్ డాలర్లు ), గౌతమ్ అదానీ ( 116 బిలియన్ డాలర్లు ), సావిత్రి జిందాల్ ( 43.7 బిలియన్ డాలర్లు ), శివ నాడార్ ( 40.2 బిలియన్ డాలర్లు ), దిలీప్ సింఘ్వీ ( 32.4 బిలియన్ డాలర్లు ) నిలిచారు.
- వీఐపీల భద్రతా విధుల నుండి NSG commando లను ఉపసంహరించి ఆ విధులను CRPF బలగాలకు అప్పగించారు
- అస్సాం వలసలకు సంబంధించి భారత పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6(A) కు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం 4-1 తేడాతో తీర్పును వెలువరించింది. సెక్షన్ 6(A) కు అనుకూలంగా జస్టిస్ DY చంద్ర చూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ MM సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పు చెప్పగా జస్టిస్ JB పార్దివాల మాత్రం సెక్షన్ 6(A) అనేది రాజ్యాంగంలో ఏకపక్షంగా చేర్చారని చెల్లుబాటు కాదని పై నలుగురి అభిప్రాయంతో ఇతడు విభేదించాడు.
- ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం 105 వ స్థానంలో నిలిచింది, మొత్తం 127 దేశాలతో కూడిన ఈ నివేదికను జర్మనీ కి చెందిన Irish Humanitarian organisation And Wealthungerhilfe అనే ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ స్కోర్ 27.3
- అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కేంద్ర ప్రభుత్వం అమలు చేసి అనేక పథకాల ప్రయోజనం సులువుగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం e – SHRAM పోర్టల్ ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అక్టోబర్ 21, 2024 రోజున ప్రారంభించాడు, ఈ పోర్టల్ లో అక్టోబర్ 22 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- వియత్నాం నూతన అధ్యక్షుడిగా లుయంగ్ క్యుంగ్ ఎన్నికయ్యారు.
- ఇండోనేషియా 8 వ అధ్యక్షుడిగా ప్రబోవో సుబియంటో ఎన్నికయ్యాడు
- దేశంలోని క్రీడా అవార్డుల హేతుబద్ధీకరణ లో భాగంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచి , క్రీడల్లో విశిష్టమైన సేవలకు గుర్తింపు గాను అందించే జీవితకాల సాఫల్య పురస్కారం స్థానంలో ఇకనుండి అర్జున జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందచేయనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
- టెస్ట్ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్న 4 వ భారతీయ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ మరియు సునీల్ గవాస్కర్ లు ఈ ఘనత సాధించారు
- ప్రపంచంలో అత్యధిక మంది పేదలు (23.4 కోట్లు) భారతదేశంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ (9.3 కోట్లు), ఇథియోపియా (8.6 కోట్లు), నైజీరియా (7.4 కోట్లు) మరియు కాంగో (6.6 కోట్లు) వరసగా 2 నుండి 5 స్థానాల్లో నిలిచాయి, ప్రపంచంలోనే మొత్తం పేదలలో 48% మంది ఈ 5 దేశాల్లోనే ఉన్నారని తన నివేదికలో వెల్లడించింది.
- 2025 జనవరి 1 నుండి 2 సంవత్సరాల కాలానికి గాను భద్రత మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా పాకిస్తాన్, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ మరియు పనామా దేశాలు ఎన్నికయ్యాయి
- వాట్ ఇస్ మీ కొత్త చైర్మన్ గా జేమ్స్ గోర్మన్ నియమితులయ్యారు, ఇతను 2025 జనవరి 2 న పదవి బాధ్యతలు స్వీకరిస్తారు.
- అంతర్జాతీయ టి20 మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది, టి20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో గాంబియా దేశంపై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇంతకుముందు రికార్డు నేపాల్ దేశం (314 పరుగులు vs మంగోలియా) పేరిట ఉంది.
- గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి విశ్వ నాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లకు చేరుకున్న 2 వ భారతీయుడు గా రికార్డు సృష్టించాడు, ఓవరాల్ గా ఐతే 2800 లైవ్ పాయింట్లు సాధించిన 16 వ ఆటగాడిగా నిలిచాడు.
- తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుల సంఖ్యను 6 నుంచి 7 మందికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మరియు ఈ మేరకు సభ్యులను నియమించింది , వారు రాములు నాయక్, M. సునీల్ కుమార్, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, KV నరసింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవాని రెడ్డి.
- జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నియమితులయ్యారు
- Touching lives while touching the moon : India’s space saga అనే థీమ్ తో తొలిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవం 23 ఆగస్టు 2024 రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర సప్నో కి ఉడాన్ పేరుతో ఇ – మ్యాగజైన్ ను ఆవిష్కరించారు, ఈ మ్యాగజైన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి NCERT పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో చూడవచ్చు.
- ఇక్రిశాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా హిమాన్షు పాతక్ నియమితులయ్యారు.
- ANR జాతీయ అవార్డు 2024 గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి
- World justice rule of law index 2024 భారత్ 0.50.లతో మొత్తం 142 దేశాల జాబితాలో 79 వ స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ దేశాలు నిలిచాయి మరియు చివరి 142 వ స్థానంలో వెనుజుల దేశం గెలిచింది. భారత్ చుట్టూ ఉన్న నేపాల్ 69 వ స్థానంలో, శ్రీలంక 75 వ స్థానంలో, బంగ్లాదేశ్ 127 స్థానంలో, పాకిస్తాన్ 129వ స్థానంలో మరియు ఆఫ్గనిస్తాన్ 140 వ స్థానాలలో నిలిచాయి.
- దేశవ్యాప్తంగా 21 వ పశు గణన లెక్కింపు ప్రక్రియను 25 అక్టోబర్ 2024 రోజున ప్రారంభించినట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 2025 వరకు జరగనున్నది.
- Airport to Authority of India చైర్మన్ గా బీహార్ క్యాడర్ కు చెందిన 1996 బ్యాచ్ IAS అధికారి విపిన్ కుమార్ గారు అక్టోబర్ 28 2024 రోజున పదవీ బాధ్యతలు స్వీకరించారు.
- NAFED (నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ గా ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 2000 బ్యాచ్ IAS అధికారి దీపక్ అగర్వాల్ గారు 26 అక్టోబర్ 2024 రోజున 5 సంవత్సరాల పదవి కాలానికి గాను నియమితులయ్యారు. NAFED 1958లో ఏర్పాటు అయింది.
- గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ (అమెరిక) 31 వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల్లో భారతదేశం నుండి ఉత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపికైంది, అవార్డును ఎస్బిఐ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అందుకున్నారు.
Very useful