Current Affairs In Telugu / 16-30 September 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా సెప్టెంబర్ నెల 16 తారీకు నుండి 30 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.
ప్రారంభమైన మొదటి వందే మెట్రో రైలు
- గుజరాత్ లోని Ahmedabad నుండి 350 కిలోమీటర్లు దూరంలో ఉన్న Bhuj పట్టణానికి మధ్య తొలి వందే మెట్రో
- ఈ రైలు ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16 సెప్టెంబర్ 2024 రోజున ప్రారంభించడం జరిగింది
- ఈ రైలు 12 కోచ్ లు , 1150 సీటింగ్ సామర్థ్యం ఉన్నది.
- మొత్తం రైలు యొక్క సామర్థ్యం 3208 మంది. మరియు ఈ రైలు గరిష్ట వేగం 110 Kmph.
- కనీస చార్జి 30 రూపాయలు కాగా, గరిష్ట చార్జి 445 రూపాయలు..
- ప్రస్తుతం రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ల స్థానంలో ఈ వందే మెట్రో రైళ్ళను నడుపనున్నారు.
2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్కో లో
- 2026 లో కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలో విక్టోరియా నగరంలో జరగాల్సి ఉండే , అధిక ఖర్చు విషయంతో ఆతిథ్య హక్కులను ఆస్ట్రేలియా వదులుకుంది.
- ప్రస్తుతానికి స్కాట్లాండ్ ప్రభుత్వం గ్లాస్కొ నగరంలో నిర్వహించడానికి ముందుకు వచ్చింది.
- గ్లాస్కొ నగరం 2014 సంవత్సరం కూడా కామన్వెల్త్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.
- ఇండియా ఒకసారి మాత్రమే 2010 సంవత్సరంలో ఈ క్రీడలను నిర్వహించింది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024
- దుబాయ్ దుబాయ్ వేదికగా 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది
- తెలుగు ఇండస్ట్రీ 2023 అవార్డు లు ; ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంతు కేసరి నిలిచింది.
- ఉత్తమ నటుడిగా నాని ( దసరా), ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ( దసరా),
- ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల ( దసరా),
- క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా ఆనంద్ దేవరకొండ ( బేబీ ), క్రిటిక్స్ ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ ( హాయ్ నాన్న ), మొదలైన వారు ఈ అవార్డులను గెలిచారు.
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
- సెప్టెంబర్ 17 న చైనాతో జరిగిన ఫైనల్ లో భారత్ 1-0 తేడాతో విజయం సాధించి ఆసియా చాంపియన్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది.
- ఆట 51వ నిమిషంలో డిఫెండర్ జుగ్ రాజ్ సింగ్ గోయల్ గోల్ కొట్టి భారత్ కి విజయం
- టోర్నీ మొత్తం ఏడు మ్యాచుల్లో 7 గోల్స్ కొట్టి భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్ కి ఇది 5 వ సారి. గతంలో 2011, 2016, 2018, 2023 సంవత్సరాలలో కూడా ఈ టైటిల్ ను సాధించింది.
- మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్తాన్ 5-2 గోల్స్ తేడాతో కొరియా ను ఓడించింది.
ఢిల్లీ నూతన సీఎం గా ఆతి శీ
- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి సెప్టెంబర్ 17 న రాజీనామా చేయడంతో నూతన సిఎం గా ఆతి శీ మర్లేనా సింగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఏ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .
- సెప్టెంబరు 22 తేదిన సిఎం గా ఆతి శీ, 5 గురు ఆప్ ఎంఎల్ఏ లు సౌరబ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లాత్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేష్ ఆహ్లవత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
- షీలా దీక్షిత్ ( కాంగ్రెస్), సుష్మా స్వరాజ్ ( బీజేపీ) తర్వాత ఆతి శీ ఢిల్లీకి 3 వ మహిళా ముఖ్యమంత్రి , మరియు దేశంలో సిఎం పదవి చేపట్టిన 17 వ మహిళ ముఖ్యమంత్రిగా ఆతి శీ నిలిచింది.
- ఆమె ప్రస్తుతం ఢిల్లీ లోని కల్నాజీ నియోజకవర్గం నుండి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.
భారత వైమానిక దళం కొత్త చీఫ్ గా అమర్ ప్రీత్ సింగ్
- భారత వైమానిక దళం ( IAF ) నూతన చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నిమామితులయ్యారు
- ప్రస్తుతము ఇతను భారత వైమానిక దళం వైస్ చీఫ్ గా పనిచేస్తున్నారు.
- ప్రస్తుత భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ మార్షల్ వివేక్ రాయ్ చౌదరి సెప్టెంబర్ 30 న పదవి విరమణ చేయనున్నారు, అదే రోజు అమర్ ప్రీత్ సింగ్ పదవి భాద్యతలు స్వీకరించనున్నారు.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే
- సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో మార్క్సిస్టు జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార డిసనాయకే విజయం సాధించడం జరిగింది
- మొత్తం పోలైన ఓట్లలో డిసనాయకే నేతృత్వం వహిస్తున్న కూటమి NATIONAL PEOPLE’S POWER 42.31 % ఓట్లను సాధించింది.
- రెండవ స్థానంలో సజిత్ ప్రేమదాస నిలిచాడు, ఇతనికి 32.76% ఓట్లు వచ్చాయి.
- ప్రస్తుత అధ్యక్షుడు రాణిల్ విక్రమ సింగే మూడో స్థానంలో నిలిచాడు
- డిసనాయకే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు తర్వాత గెలిచారు, మొదటి రౌండ్లో ఈ అభ్యర్థికి 50% ఓట్లు రాలేదు, దీంతో రెండో రోజు లెక్కించారు , ఈ రౌండ్ లెక్కింపు తర్వాత డిసనాయకే దాదాపు 75% ఓట్లు సాధించారు
- శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ద్వారా గెలిచిన మొట్టమొదటి అధ్యక్షుడు ఇతనే
- అధ్యక్షులు ఎన్నికైన డిసనాయకే సెప్టెంబర్ 23 తారీకున ప్రమాణ స్వీకారం చేశారు
చెస్ ఒలంపియాడ్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు
- చెస్ ఒలంపిక్స్ గా పిలిచే చెస్ ఒలంపియాడ్ లో భారత్ రెండు స్వర్ణ పథకాలతో అద్భుత ప్రదర్శన చేసింది, భారత అబ్బాయిలు మరియు అమ్మాయిలు రెండు జట్లు కూడా స్వర్ణ పథకం సాధించారు
- అర్జున్ ఇరిగేసి (Telangana), పెంటేల హరికృష్ణ ( Andhra Pradesh), గుకేష్ దొమ్మరాజు (Tamilnadu), ప్రాజ్ఞానంద (Tamilnadu), విదిత్ గుజరాతీ (Maharastra) లతో కూడిన పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో స్వర్ణం గెలిచింది. 11 వ రౌండ్లో స్లోవేకియా జట్టుపై 3.5-0.5 తేడాతో విజయం సాధించి 21 పాయింట్లతో స్వర్ణ పథకం గెలిచింది.
- ద్రోణవల్లి హారిక (Tamilnadu), వైశాలి (Tamilnadu), దివ్య దేశ్ముక్ (Maharastra), తానియ సచ్దేవ్ (Delhi), వంతిక అగర్వాల్ (Up) తో కూడిన భారత మహిళల జట్టు ఓపెన్ విభాగంలో స్వర్ణం గెలిచింది. 11 వ రౌండ్లో అజర్భైజెన్ జట్టును 3.5-0.5 తేడాతో ఓడించి 19 పోయిట్లతో స్వర్ణ పథకం సాధించారు.
- పురుషుల విభాగంలో అమెరికా రజత పథకం గెలువగా, ఉజ్బెకిస్తాన్ కాంస్యం సాధించింది
- మహిళల విభాగంలో కజకిస్తాన్ రజత పథకం గెలువగా, అమెరికా కాంస్య పథకం సాధించింది
- చెస్ ఒలంపియాడ్ లో భారత్ కి ఇవే మొదటి స్వర్ణ పతకాలు, ఇంతకుముందు ఈ టోర్నీలో మూడు కాంస్య పథకాలు మాత్రమే ఉన్నాయి. పురుష జట్టు 2014 & 2022 సంవత్సరాలలో మహిళా జట్టు 2022 సంవత్సరంలో కాంస్య పతకాలు సాధించాయి.
- ఈసంవత్సరం చెస్ ఒలంపియడ్ పురుష విభాగంలో 193 జట్లు, మహిళల విభాగంలో 181 జట్లు పోటీ పడ్డాయి.
- 1924 సంవత్సరంలో మొదటి సరిగా ఈ క్రీడలు జరుగగా, 1927 నుండి అధికారికంగా నిర్వహిస్తున్నారు
- ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు జరుగుతాయి.
- 45 వ చెస్ ఒలింపియాడ్ పోటీలు హంగేరి దేశం బుడాపెస్ట్ నగరంలో సెప్టెంబర్ 10 నుండి 23 వ తేది వరకు జరిగాయి
- 46 వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో 2026 సంవత్సరంలో జరుగనున్నాయి.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా రియా సింఘా
- 2024 సంవత్సరానికి మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రియా సింఘా గెలుచుకున్నారు.
- ఈ విజయంతో అంతర్జాతీయ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ఈమె ప్రాతినిధ్యం వహించనుంది.
- మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధృవీ పటేల్ గెలుచుకుంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రింకోర్టు తీర్పు
- చైల్డ్ పోర్న్ చూడడం , ఎలక్ట్రాన్ డివైజ్ లలో కలిగి ఉండడం నేరం కాదంటూ జనవరి 11, 2024 న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది
- సెప్టెంబర్ 23 న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, JB పార్దివాల లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, download చేసుకోవడం, డివైజ్ లలో స్టోరేజ్ చేసుకోవడం కూడా శిక్షార్హమైన నేరంగా తీర్పు ఇచ్చింది.
- IT ఆక్ట్ లోని సెక్షన్ 67(B) , పోక్సో ఆక్ట్ (2012) ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ శిక్షార్హమైన నేరంగా ఈ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్య నియమాకం
- శ్రీలంక దేశానికి కొత్త ప్రధాని గా హరిణి అమర సూర్య నియమితులయ్యారు.
- అనుర కుమార డిసనాయకే ఆధ్వర్యంలో ఈమె సెప్టెంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది
- తాజా ఎన్నికల తర్వాత మాజీ ప్రధాని దినేష్ కుమార్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు
- సెప్టెంబర్ 23 న శ్రీలంక దేశానికి నూతన అధ్యక్షునిగా అనుర కుమార డిసనాయకే నియమితులైన విషయం తెలిసిందే
QS ర్యాంకింగ్స్ 2025
- లండన్ కు చెందిన ప్రముఖ ఉన్నత విద్య విశ్లేషణ సంస్థ QS ప్రపంచంలోని 58 దేశాల్లో అత్యుత్తమంగా ఉన్న 340 ఎంబీఏ, బిజినెస్ కోర్సు ల ప్రమాణాలను విశ్లేషించి ఈ ర్యాంకులను ప్రకటించింది
- Business schools లో అమెరికాలోని స్టాన్ ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా 5 వ సారి మొదటి స్థానంలో నిలిచింది, తర్వాతి స్థానాల్లో వరుసగా వార్టన్ ( అమెరికా ), హార్వర్డ్ ( అమెరికా ) బిజినెస్ స్కూల్స్ నిలిచాయి. భారత్ నుండి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( హైదరాబాదు ) మాత్రమే టాప్ 100 లో నిలిచింది.
- MBA కోర్సుల నిర్వహణ ప్రమాణాలలో TOP 100 విద్యాసంస్థల్లో భారత్ నుండి మూడు విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి.అవి బెంగుళూర్, కోల్ కతా, అహ్మదాబాద్ నగరాలలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( IIM ) విద్యాసంస్థలు.
ఇతర ముఖ్యమైన అంశాలు
- అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురం గా మారుస్తున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రిఅమిత్సె షా సెప్టెంబర్ 13న ప్రకటించారు
- సశాస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యారు.
- ఫార్ములావన్ అజర్ బైజాన్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ ను మెక్ లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్త్రి విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆస్కార్ పియాస్త్రి కి కెరీర్ లో ఇది 2వ టైటిల్ ( మొదటి టైటిల్ హంగేరి గ్రాండ్ ప్రీ ).
- National Institute of Indian Medical Heritage (NIIMH) ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది. ఈ కేంద్రం 4 సంవత్సరాల పాటు పని చేయనుంది.
- National Engineer’s Day ( SEPTEMBER 15 ) 2024 సంవత్సరం యొక్క థీమ్ INNOVATING FOR A SUSTAINABLE FUTURE. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు ను పురస్కరించుకొని 1968 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుకుంటున్నాము.
- Diamond League ఫైనల్ లో నిరాజ్ చోప్రా 2వ స్థానంలో ( 87.86 ) నిలిచాడు.
- మహిళా ఉపాధి, సాధికారత లక్ష్యంగా భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు, పాల ఉత్పదకత మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0 ను సెప్టెంబర్ 19 2024 రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు
- తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ హీరో చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది, most prophelic film star in Indian film industry actor and dancer గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సాధించారు. 156 మూవీస్, 537 సాంగ్స్, 24000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకి రికార్డు దక్కింది.
- దులీప్ ట్రోఫీ ని ఇండియా ఎ జట్టు గెలుచుకుంది, నాలుగు జట్లు ( ఇండియా A,B,C,D ) పోటీ పడిన ఈ టోర్నీ లో ఇండియా ఎ జట్టు 3 మ్యాచుల్లో 2 విజయాలతో విజేతగా నిలిచింది.
- ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ( జూన్ 12 ) 2014 సంవత్సరం థీమ్ – let’s act on our commitments ; End child labour.
- టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన Gretest Places Of 2024 జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాలు Museum of solutions ( Mumbai ), Manam chocolate ( Hyderabad ), Not fine dining restaurant ( Himachal Pradesh ).
- వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ( జూన్ 24 ) 2024 థీమ్ – 20 YEARS OF CELEBRATING GIVING : THANK YOU BLOOD DONORS.
- బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ T20 మరియు టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్డ్ అవుతానని ప్రకటించారు.
- రాష్ట్రంలో గంజాయి సాగు చట్టబద్ధం చేసేలా హిమాచల్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.
- పూణే విమానాశ్రయానికి కొత్తగా సంతు తుకారం అని పేరు పెట్టడం జరిగింది.
- ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ మలయాళీ దినపత్రిక మాతృభూమి ఎండి MV శ్రేయాంస్ కుమార్ ఎన్నికయ్యారు.41 మందితో కూడిన కొత్త మంత్రి వర్గంలో vice President గా కరణ్ రాజేంద్ర, deputy president గా వివేక్ గుప్తా ఎన్నికయ్యారు.
- లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్ల ఇజ్రాయిల్ దేశం చేసిన వైమానిక దాడిలో మృతి చెందాడు
- ప్రతి సంవత్సరం గోవా రాష్ట్రంలో జరిగే international film festival of India 55 మరియు 56 ఎడిషన్ లకు డైరెక్టర్ గా శేఖర్ కపూర్ నియమితులయ్యారు.
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( September 27 ) 2024 థీమ్ – TOURISM AND PEACE
Also read more articles ;
👉🏻Current Affairs In Telugu / 1-15 September 2024
👉🏻Current Affairs In Telugu / 16-31 August 2024
1 thought on “Current Affairs In Telugu / 15-30 September 2024 / GovtJobPreparation.com”
Comments are closed.