Current Affairs In Telugu / 1-15 September 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా సెప్టెంబర్ నెల 1 తారీకు నుండి 6 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని వివరించడం జరిగింది.
23 వ లా కమిషన్ ఏర్పాటు
- ఆగస్టు 31 తారీకుతో 22 లా కమిషన్ పదవి కాలం ముగియంతో కేంద్ర ప్రభుత్వం 23 వ లా కమిషన్ ను సెప్టెంబర్ 2 వ తారీఖున ఏర్పాటు చేసింది.
- ఈ కమిషన్ లో ఒక చైర్మన్ మరియు నలుగురు ఇతర సభ్యులు ఉంటారు
- చైర్మన్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు.
ఇతర ముఖ్యమైన అంశాలు
- హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నూతన సిఎండీ గా డా.DK సునీల్ ఆగస్టు 31 న బాధ్యతలు స్వీకరించారు.
- నెల్సన్ మండేలా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు గా వినోద్ గణత్రా నిలిచారు.
- మహిళలు పనిచేసే చోట రక్షణ కోసం SHE BOX అనే నూతన ప్రోగ్రాం ను కేంద్ర మహిళా మరియు చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు ఆగస్టు 29 న ప్రారంభించారు
- నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
- Hindustan Aeronautical Limited చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( CMD ) గా CB అనంత కృష్ణన్ స్థానంలో DK సునీల్ ఆగస్టు 31 2024 న బాధ్యతలను స్వీకరించాడు.
- ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ ను నియమించిన అధ్యక్షుడు ఇమ్మన్యుయెల్ మెక్రాన్.
- జులై 1 నుండి అమల్లోకి వచ్చిన భారత నూతన నేర న్యాయ చట్టాల ప్రకారం తొలి శిక్ష సెప్టెంబరు 5 న బీహార్ రాష్ట్రంలో ఓ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు శిక్ష పడింది.
- తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా M. కోదండ రెడ్డి
- తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్. సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ మరియు బాలలక్ష్మి
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి
- టైం మ్యాగజిన్ ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావశీల వ్యక్తుల పేర్లతో MOST INFLUENTIAL PEOPLE IN AI 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుండి అశ్విని వైష్ణవ్ ( కేంద్ర సమాచార మరియు సాంకేతిక శాఖల మంత్రి ), అనిల్ కపూర్ ( బాలీవుడ్ యాక్టర్ ) మరియు నందన్ నీలేఖని ( ఆధార్ రూపకర్త ) చోటు సంపాదించుకున్నారు.
Daily Current Affairs / 1-15 September 2024 / GovtJobPreparation.com
Completed 6th
1 thought on “Current Affairs In Telugu / 1-15 September 2024 / GovtJobPreparation.com”
Comments are closed.