Current Affairs In Telugu / 1-15 October 2024

Current Affairs In Telugu / 1-15 October 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా అక్టోబరు నెల 1 తారీకు నుండి 8 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2024) విజేతగా మిథున్ చక్రవర్తి

  • సినిమా రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ఇస్తుంది
  • 2024 సంవత్సరానికి గాను పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని జూరి ఎంపిక చేసింది
  • జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ( అక్టోబరు 08 ) అతను ఈ అవార్డును అందుకోనున్నారు.
  • మిథున్ చక్రవర్తి ఇదే సంవత్సరం జనవరిలో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు

 

నాటో నూతన ప్రధాన కార్యదర్శిగా మార్క్ రూట్

  • నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ( NATO ) నూతన ప్రధాన కార్యదర్శిగా నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి  మార్క్ రూట్ ఎన్నికయ్యారు 
  • 10 సంవత్సరాల పాటు నాటో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జెన్స్ స్టోలెన్ బర్గ్ ( 2014-2024 ) రాజీనామా చేయడంతో నూతనంగా ఇతను అక్టోబరు 01 న బాధ్యతలు స్వీకరించారు
  • నాటో కి ఇతడు 14 వ ప్రధాన కార్యదర్శి
  • ప్రస్తుతం నాటో లో 32 సభ్య దేశాలు కలవు.

 

4 సంస్థలకు నవరత్న హోదా

  • నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు కొత్తగా నవరత్న హోదా లభించింది
  • ఈ నాలుగు సంస్థల చేరికతో మొత్తం నవరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 25 కు చేరింది 
  • కొత్తగా నవరత్న హోదా పొందిన 4 సంస్థలు
  1. National hydraulic Power corporation 
  2. Sutlej jila Vidyut Nigam 
  3. Solar energy corporation of India 
  4. RailTel corporation of India

 

కొత్తగా 5 భాషలకు శాస్ర్తియ భాషా హోదా

  • 3rd అక్టోబరు 2024 రోజున కేంద్ర కేబినెట్ మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ మరియు బెంగాలీ అనే 5 భాషలకు శాస్ర్తీయ భాషా హోదా కల్పించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు 
  • 1500 – 2000 సంవత్సరాల చరిత్ర గల భాషలను మరింత అభివృద్ధి చెయ్యడం కోసం ఆ భాష యొక్క సాహిత్యం, సంసృతి అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కృషి చెయ్యాలనే ఉద్దేశ్యంతో 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనున్నట్లు అందుకు కొనసాగింపుగా భాషా నిపుణుల కమిటీ ని నవంబర్ 1 2004 నియమించింది.
  • అక్టోబర్ 3 న 5 భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించిన తర్వాత మొత్తం ప్రాచీన హోదా కలిగిన భాషల సంఖ్య 11 కు చేరింది.
  • మొదటగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ హోదాను మంజూరు చేసేది కానీ తర్వాత కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాషా నిపుణుల కమిటీ సహాయంతో వివిధ భాషలకు ఈ ప్రాచీన భాషా హోదాని కల్పిస్తున్నది.
  • శాస్త్రీయ భాషా హోదా పొందిన భాషల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తుంది.
  • ప్రాచీన భాషా హోదా పొందిన భాషలు వరుస క్రమంలో.
  1. తమిళం ( 2004)
  2. సంస్కృతం ( 2005 )
  3. తెలుగు ( 2008 )
  4. కన్నడ ( 2008 )
  5. మలయాళం ( 2013 )
  6. ఒడియా ( 2014 )
  7. మరాఠీ ( 2024 )
  8. పాళీ ( 2024 )
  9. ప్రాకృతం ( 2024 )
  10. అస్సామీ ( 2024 )
  11. బెంగాలీ ( 2024 )

 

నోబెల్ ప్రైజ్ 2024 విజేతలు

  • స్వీడన్ కి చెందిన శాస్త్రవేత్త ఆల్ ఫ్రైడ్ నోబెల్ మరణాంతరం అతని పేరు మీద ప్రపంచవ్యాప్తంగా భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం మరియు శాంతి రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు మరియు సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు 
  • 1896లో ఆల్ ఫ్రైడ్ నోబెల్ గారు మరణించారు, వివిధ రంగాల్లో విశేషమైన సేవ చేసిన వ్యక్తులకు 1901 నుండి ఆయన ట్రస్టు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందజేస్తుంది
  • అవార్డు గ్రహీతలు 11 లక్షల స్వీడిష్ క్రౌన్స్ / 1.1 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ గా పొందుతారు
  • ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ప్రకటించగా డిసెంబర్ 10 న ఆల్ ఫ్రైడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా విజేతలకు ఈ అవార్డులను అందజేస్తారు.
  • నోబెల్ బహుమతులను మొదటగా 5 కేటగిరీలలో ఇచ్చేవారు, అయితే 1968 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి ఇవ్వనున్నట్లు ట్రస్ట్ ప్రకటించగా 1969 సంవత్సరం నుండి అర్థశాస్త్రంలో కూడా ఈ అవార్డును అందజేస్తున్నారు
  • 2024 నోబెల్ బహుమతి విజేతలు 

1. వైద్యశాస్త్రం

  • వైద్యశాస్త్రంలో 2024 సంవత్సరానికి గాను హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అయిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రవ్ కున్ లు సంయుక్తంగా ఎంపికయ్యారు.
  • భూమిపై సమస్త జీవుల  పుట్టుక, ఎదుగుదల మరియు వాటి పనితీరుకు సంబంధించిన RNA ను ఆవిష్కరించినందుకు గాను వీరికి ఈ అవార్డు దక్కింది
  • వైద్యశాస్త్ర నోబెల్ విజేతలను అక్టోబర్ 7 వ తారీఖున ప్రకటించారు

2. భౌతిక శాస్త్రం

  • భౌతిక శాస్త్రంలో 2024 సంవత్సరానికి గాను జాన్ J. హోప్ ఫీల్డ్ మరియు గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ న్యూరల్ గా పిలిచే జెఫ్రీ E. హింటన్ లను సంయుక్తంగా ఎంపికయ్యారు.
  • ఆర్టిఫీషియల్ న్యూరల్ ఆధారిత మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు వీరికి ఈ అవార్డ్ దక్కింది.

3.కెమిస్ట్రీ

  • కెమిస్ట్రీ విభాగంలో 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి బ్రిటన్ సైంటిస్ట్ డెమిస్ హసాబిస్, అమెరికన్ సైంటిస్టులు డేవిడ్ బకర్, మైకేల్ జాన్ జంపర్ లు ఎంపికయ్యారు.
  • కొత్త రకం ప్రోటీన్ మరియు ప్రోటీన్ స్టక్చర్ ను ముందే ఊహించెందుకు కనిపెట్టిన AI లకు గాను వీరికి ఈ అవార్డు దక్కింది.

4.సాహిత్యం

  • సాహిత్యం విభాగంలో 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతికి సౌత్ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ ఎంపికయ్యారు.
  • హాన్ కాంగ్ తన రచనల ద్వారా సాధారణ మానవుల జీవిత దుర్బలత్వం, చారిత్రక విషాధాలను సహజ శైలిలో కండ్లకి కట్టినట్లుగా వివరించారు.
  • హాన్ కాంగ్ రాసిన THE VEGITARIAN నవలకు 2016 సంవత్సరంలో బుకర్ ప్రైజ్ లభించింది.

5.శాంతి

  • శాంతి విభాగంలో 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతికి జపాన్ దేశానికి చెందిన నిహన్ హిండక్యో సంస్థ ఎంపికయ్యింది 
  • ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు చేస్తున్న కృషికి గాను నోబెల్ పురస్కారం లభించింది.
  • హిరోషిమా, నాగసాకి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న కొంతమంది వ్యక్తులు కలిసి 1956 సంవత్సరంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

6.అర్థశాస్త్రం

  • 2024 సంవత్సరానికి గాను అర్థశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతి ని డారెన్ అసెమోగ్లు ( మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ), సైమన్ జాన్సన్ ( మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) మరియు జేమ్స్ రాబిన్సన్ ( షికాగో యూనివర్సిటీ ) సంయుక్తంగా గెలుచుకున్నారు.
  • కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి ? మరియు మరికొన్ని దేశాలు ఎప్పుడు ఎందుకు పేదరికంలో మగ్గుతున్నాయి ? అనే అంశం మీద వీరు చేసిన పరిశ్రమలకు ఈ అవార్డు దక్కింది.

 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 

  • అక్టోబర్ 08 న వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వరసగా 3 వ సారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.
  • రాష్ట్ర అసెంబ్లీ మొత్తం సీట్లు 90 కాగా బీజేపీ పార్టీ 48 స్థానాలలో విజయం సాధించింది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో, ఇండియన్ నేషనల్ లోకదల్ ( INLD ) పార్టీ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
  • గత ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాల్లో, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించారు
  • లద్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి లయాబ్ సింగ్ సైనీ గెలిచారు.
  • రిజ్లర్ వినేష్ పొగట్ కాంగ్రెస్ పార్టీ తరపున జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు
  • ముఖ్యమంత్రిగా నాయాబ్ సింగ్ సైని అక్టోబర్ 17వ తారీఖున ప్రమాణస్వీకారం చేశాడు. అతనితోపాటు మరో 13 మంది మంత్రులుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 
  • నాయబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి.

 

జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 

  • దాదాపు 10 సంవత్సరాల తర్వాత జరిగిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమి విజయం సాధించింది.
  • మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా ఇండియా కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 06 స్థానాల్లో, సిపిఎం ఒక స్థానంలో విజయం సాధించాయి.
  • బీజేపీ పార్టీ 29 స్థానాల్లో , పీడీపీ 03 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ, అవామీ ఇత్తెహద్ చెరొక స్థానం లో, ఇతరులు 03 స్థానాలలో విజయం సాధించారు.
  • కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కి నూతన సీఎంగా ఒమర్ అబ్దుల్లా అక్టోబర్ 16న ప్రమాణస్వీకారం చేశారు, అతనితోపాటు మరో ఐదుగురు మంత్రులు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా గతంలో 2009 నుండి 2014 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.

 

RBI ద్రవ్య పరపతి విధాన కమిటీకి ముగ్గురు కొత్త సభ్యులు

  • RBI మానిటరీ పాలసీ కమిటీ కి 4 సంవత్సరాల కాలానికి ఎక్స్ టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, S.భట్టాచార్య, నగేష్ కుమార్ లను కేంద్ర ప్రభుత్వం నియమించింది
  • RBI Act ( 1934 ) ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ లో మొత్తం 6 గురు సభ్యులు ఉంటారు. వీరిలో ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించగా, మిగిలిన ముగ్గురు ఆర్బీఐ నుండి నియమించబడుతారు.
  • ఈ కమిటీ కి ఎక్స్ అఫిషియో ఛైర్మన్ గా ఆర్బీఐ గవర్నర్ వ్యవహరిస్తారు.

 

ఇతర ముఖ్యమైన అంశాలు

  • జపాన్ నూతన ప్రధానమంత్రిగా షీగేరు ఇషీబా ఎన్నికయ్యారు
  • అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు పూర్తిచేసిన నాలుగో క్రికెట్ గారికి విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు ఇతని కంటే ముందు సచిన్ టెండుల్కర్ రికీ పాంటింగ్ కుమార సంగం అన్నారు
  • మెక్సికో దేశ తొలి మహిళా ప్రధానిగా క్లాడియ షేన్బామ్ అక్టోబరు 1 న బాధ్యతలు స్వీకరించారు 
  • బేగంపేట women’s degree College లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు, తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు.
  • మహిళలపై అత్యాచారం లేదా హత్య వంటి నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించేలా తీసుకొచ్చిన అపరాజిత బిల్లుకు పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
  • కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గోబా స్థానంలో TV సోమనాథన్ నియమితులయ్యారు,  ఇతను 2 సంవత్సరాల కాలం ఈ పదవిలో కొనసాగనున్నారు
  • BCCI అవినీతి నిరోధక విభాగం ( ACU ) హెడ్ గా హర్యానా రాష్ట్ర కేడర్ కు చెందిన రిటైర్డ్ IPS ఆఫీసర్ శరద్ కుమార్ నియమితులయ్యారు.
  • World Animals Day ( అక్టోబరు 4 ) 2024 థీమ్ – The World Is Their Home Too.
  • Central board of Direct taxes ( CBDT )  నూతన చైర్మన్ గా రవి అగర్వాల్ నియమితులయ్యారు.
  • Krishna River Management Board చైర్మన్ గా అతుల్ జైన్ నియమితులయ్యారు.
  • అందత్వానికి దారి తీసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రకోమా వ్యాధిని నిర్మూలించిన మూడవ ఆగ్నేయ ఆసియా దేశంగా భారతదేశం నిలిచిందని 08 అక్టోబర్ 2024న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) ప్రకటించింది.
  • ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు 09 అక్టోబర్ 2024 రోజున అనారోగ్య సమస్య లతో మరణించాడు. రతన్ టాటా గారు 2000 సంవత్సరంలో పద్మ భూషణ్, 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు 
  • UPI Lite వాలెట్ పరిమితిని 2000 నుండి 5000 లకు మరియు ఒక్కో లావాదేవీ లిమిట్ 500 నుండి 1000 కి పెంచుతూ RBI నిర్ణయం.
  • పేద ప్రజలలో ఉన్న రక్తహీనత, పోషకాహార లోపాలను అధిగమించడానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్యూరిఫైడ్ బియ్యం అందించే ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని 2028 డిసెంబర్ నెలవరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం.
  • ఐక్య రాజ్య సమితి మానవతా వ్యవహారాల అధిపతిగా టామ్ ప్లేచర్ ( బ్రిటన్ ) నియమితులయ్యారు.
  • టాటా ట్రస్టు చైర్మన్ గా నోయెల్ టాటా గారు నియమితులయ్యారు.
  • దేవేందర్ సింగ్ vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో 01 ఆగస్టు 2024 రోజున ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై అధ్యయనం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ ఎస్సీ వర్గీకరణ పై అధ్యయనం కోసం ఏకసభ్య కమిషన్ ను నియమించాలని సూచించింది దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ శమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను అక్టోబర్ 11 2024 న నియమించింది. ఎస్సీ వర్గీకరణ పై సమగ్ర అధ్యయనం చేసి విధివిధానాలను సూచించాలని అలాగే రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

 

Also Read :

Current Affairs In Telugu / 15-30 September 2024