Current Affairs In Telugu/ కరెంట్ అఫైర్స్ / 1-15 November 2024

Current Affairs In Telugu/ కరెంట్ అఫైర్స్ / 1-15 November 2024 ; కాంపిటీటివ్ ఎగ్జామ్ లో విజయం పొందడానికి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వెబ్సైట్ ద్వారా డైలీ న్యూస్ పేపర్లు మరియు ప్రభుత్వ వెబ్సైట్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ను మరియు దానికి సంబంధించిన సబ్జెక్టులో ఉన్న కంటెంట్ ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు 

  • అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ పై గెలుపొందడం జరిగింది.
  • 2016 సంవత్సరంలో మొదటి సారి అమెరికా అధ్యక్షుడుగా గెలిచిన ట్రంప్ మరల ఇప్పుడు 2 వ సారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఇలా ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసి గ్యాప్ తర్వాత గెలిచిన అధ్యక్షులలో ట్రంప్ 2 వ వ్యక్తి. మొదటి వ్యక్తి గ్రోవర్ క్లివ్ లాండ్ ఇతను 1885-89 అధ్యక్షుడిగా పనిచేసి మరలా తిరిగి 1893 నుండి 97 వరకు అధ్యక్షులు పనిచేశారు. వరసగా 2 సార్లు మాత్రం ఇప్పటికీ చాలా మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
  • అమెరికా అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి  గరిష్టంగా రెండుసార్లు మాత్రమే నిర్వహించగలరు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా కేవలం రూజ్ వెల్డ్ మాత్రమే 4 సార్లు (1932,1936, 1940, 1944) అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు.
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రాలను మూడు రకాలుగా విభజిస్తారు. రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపే రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ గా, డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపే రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ గా, తటస్థంగా ఉండే రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్ గా విభజిస్తారు , ఈ అధ్యక్ష ఎన్నికలలో స్వింగ్ స్టేట్స్ 7 ఉండగా అన్నింటిలోనూ ట్రంప్ విజయం సాధించారు.

 

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 

  • భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము సమక్షంలో అక్టోబర్ 11న ప్రమాణస్వీకారం చేశారు. 
  • జస్టిస్ DY చంద్రచూడ్ gari పదవి కాలం అక్టోబర్ 10న ముగియడంతో నూతన సీజేఐ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నియమితులయ్యారు.
  • ఇతను మే 13 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. 
  • జనవరి 2019 నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.

 

హురున్ ఇండియా ఫిలాంత్రఫీ లిస్టు 2024

  • 2023 24 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశంలో  దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాను హురూన్ ఇండియా ఫిలాంత్రఫి లిస్ట్ వెల్లడించింది.
  • మొదటి స్థానం లో HCL technologies వ్యవస్థాపకుడు శివ నాడార్ కల్వరి నిలిచాడు. ఇతను 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యను అందించడం కోసం దాదాపు 2153 కోట్లను దానం చేసాడు, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 5% ఎక్కువ. 
  • రెండవ స్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబ 407 కోట్లను అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో బజాజ్ గ్రూప్ సంస్థ ఇంజనీరింగ్ విద్య పై 352 కోట్లు, కుమార్ వందనం బిర్లా విద్యపై 334, గౌతమ్ అదాని కుటుంబం 330 కోట్లను మారుమూల గ్రామంలో విద్యను అందించడం కోసం ఖర్చు చేశారు.

 

రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నరేంద్ర మోడీ

  • ఇండియా టుడే నిర్వహించిన తన సర్వేలో దేశంలో రాజకీయంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిలిచారు.
  • 2024 లో దేశంలో రాజకీయంగా ఉన్న పరిస్థితులు, నాయకుల యొక్క శక్తి సామర్థ్యాలు వారి యొక్క పనితీరు ఆధారంగా ఈ సర్వేను నిర్వహించింది
  • రాజకీయంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలువగా తర్వాత స్థానాల్లో వరుసగా మోహన్ భగత్, అమిత్ షా, రాహుల్ గాంధీ మరియు చంద్రబాబు నాయుడు నిలిచారు.
  • అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రులలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలువగా తర్వాతి స్థానాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిలిచారు.

 

 9వ ఎడిషన్ గరుడ శక్తి సైనిక విన్యాసాలు

  • భారత్ ఇండోనేషియా మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను గరుడ శక్తి పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. 
  •  2024 లో 9వ ఎడిషన్ విన్యాసాలను ఇండోనేషియా రాజధాని జకార్తా లోని సింజంటంగ్ ప్రాంతంలో జరిగాయి.
  • నవంబర్ 1 – 12 వరకు జరుగనున్నాయి.

 

15వ ఎడిషన్ వజ్ర ప్రహర్ యుద్ధ విన్యాసాలు

  • భారత్, అమెరికా ప్రత్యేక బలగాల ఉమ్మడి యుద్ధ విన్యాసాలను వజ్ర ప్రహార్ పేరుతో నిర్వహిస్తారు.
  • 15 ఎడిషన్ విన్యాసాలను అమెరికాలోని ఇదాహోలో ఉన్న అర్చార్డ్ కంబాట్ ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతున్నాయి.
  •  15వ ఎడిషన్ విన్యాసాలు 2024 నవంబర్ 2 – 22 వరకు జరుగనున్నాయి.
  • ప్రతి దేశం నుండి 45 మంది సైనికులు ఈ యొక్క విన్యాసాలలో పాల్గొన్నారు.
  • ఈ విన్యాసాలలో భారత తరఫున స్పెషల్ ఫోర్సెస్ అలాగే అమెరికా తరఫున గ్రీన్ బెరెట్స్ సైనికులు పాల్గొన్నారు.
  • గత సంవత్సరం ఈ విన్యాసాలు భారత్ లోని మేఘాలయ లో జరిగాయి.

 

3rd ఎడిషన్ ఆస్ట్రహిండ్ సంయుక్త సైనిక విన్యాసాలు

  • భారత్ ఆస్ట్రేలియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను ఆస్ట్రహిండ్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇవి మూడో ఎడిషన్ విన్యాసాలు.
  • నవంబర్ 8 నుండి నవంబర్ 21 2024 వరకు పూణే లోని ద ఫారెన్ ట్రైనింగ్ నొడ్ సెంటర్ లో జరుగుతున్నాయి.

VIN – BAX ఆర్మీ విన్యాసాలు 2024

  • భారత్ మరియు వియత్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసాలను VIN – BAX పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది
  • ఈ సంవత్సరం ఈ విన్యాసాలు భారత్ లోని హర్యానా రాష్ట్రంలో అంబాల మరియు చాండిమందిర్ ప్రాంతంలో జరుగుతున్నాయి. 
  • నవంబర్ 4-23 తేదీల వరకు 5వ ఎడిషన్ విన్యాసాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి.
  • గత సంవత్సరం వియత్నాం దేశంలో నిర్వహించారు.

 

ఇతర ముఖ్యమైన అంశాలు ;

  • నాస్కామ్ (national association of software and services company) చైర్మన్ గా రాజేష్ నంబియార్ స్థానంలో సింధు గంగాధరన్ నియమితులయ్యారు.
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం అయినా అక్టోబర్ 29 2017 రోజున ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కూడా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య భీమా అందించేలా విస్తరించారు.
  • జనన, మరణాల నమోదు కోసం  హౌరా నమోదు వ్యవస్థ అనే మొబైల్ యాప్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అక్టోబర్ 29 2024 రోజున ఆవిష్కరించారు, ఈ యాప్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
  • రక్షణ శాఖ కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.
  • గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నివేదిక 2024 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్ గా వరుసగా రెండోసారి నిలిచారు
  • తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ సవరించడానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసింది. చైర్మన్ గా బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా బి సైదులు నియమితులయ్యారు.
  • బంధన్ బ్యాంక్ నూతన ఎండి సీఈఓ గా పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు.
  • రైల్వే ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవలను కేవలం ఒకే దగ్గర అందించడానికి INDIAN RAILWAY SUPER APP పేరుతో ఈ సంవత్సరం చివరి నాటికి ఒక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.
  • ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ స్థానాలకు రాబోయే 2 సంవత్సరాలకు (2024-26) ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు, నవంబర్ 4 2024 లో జరిగిన 7 వ సోలార్ అలియన్స్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎన్నికయ్యాయి.
  • ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా MV శ్రేయాంస్ కుమార్ ఎన్నికయ్యాడు.
  • జపాన్ ప్రధాన మంత్రి గా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కి చెందిన షిగెరు ఇశిబ మరోసారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి యోషీహికో నోడా పై 221-160 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది.
  • QS (quacquarelli Symonds) సంస్థ 984 యునివర్సిటీ లతో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ : ఆసియా 2025 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ నుండి 22 యూనివర్సిటీలో చోటు పొందగా, 6 యూనివర్సిటీ టాప్ 100 లో నిలిచాయి.
  • మిస్ ఎర్త్ 2024 విజేతగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన జెస్సికా లేన్ నిలిచారు.
  • నల్సా (National Legal Services Authority) నూతన కార్యనిర్వాహణ అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BR గవాయి నియమితులయ్యారు. నవంబర్ 11 న ఇతడు పదవి బాధ్యతలు స్వీకరించారు.
  • Whitehouse Chief Of Staff గా సూసీ వైల్స్ నియామకం అయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు, ఈమె ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ యొక్క ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు.
  • Trust for advancement of agricultural sciences సంస్థ జాతీయ స్థాయిలో వ్యవసాయంలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందిస్తున్నారు. ఈ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు చెందిన బొడ్డుపల్లి మారుతి ప్రసన్న ఎంపికయ్యారు.ఈ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయల నగదు మరియు ప్రశంస పత్రాన్ని అందిస్తారు.
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ లో వరసగా 7 వ సారి మొత్తంగా 28 వ సారి ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు. ఈ సంవత్సరం దోహోలో జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ ఆటగాడు రాబర్ట్ హాల్ ను 4-2 తో ఓడించాడు.
  • కాప్ (conference of parties) 29వ సదస్సు అజర్ బైజన్ రాజధాని బాకు వేదికగా నవంబర్ 11 నుండి 22 వరకు జరగనున్నది.
  • మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం.
  • అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో.

Leave a Comment