Current Affairs In Telugu / 01-03 June 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 01-03 June 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా జూన్ నెల 1 తారీకు నుండి 3 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

అమెరికా స్పెల్ బీ విజేతగా భారత సంతతి కుర్రోడు
  • వాషింగ్టన్ లో జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి 2024 పోటీలో విజేతగా భారత సంతతికి చెందిన కుర్రాడు బృహత్ సోమ విజేతగా నిలిచాడు
  • బృహత్ సోమ వాళ్ళ తండ్రి శ్రీనివాస్ సోమ తెలంగాణలోని నల్లగొండ వాసి,  ఇతను ఫ్లోరిడా లో స్థిరపడ్డాడు
  • 90 సెకండ్లలో 30 పదాలకు గాను 29 పదాలకు సరైన సమాధానం చెప్పి విజేతగా నిలిచాడు
  • విజేతగా నిలిచిన బృహత్ కు 50,000 డాలర్ల ప్రైజ్ మనీ లభించింది, ఇది భారత కరెన్సీలో దాదాపు 42 లక్షలకు సమానం.
  • ఈ పోటీల్లో మొత్తం 50 రాష్ట్రాల నుండి 245 మంది విద్యార్థులు పాల్గొన్నారు
  • 90 సెకండ్లలో 25 పదాలకు గాను 21 పదాలకు సరైన సమాధానం చెప్పి ఫైజాన్ జాకి సెకండ్ స్థానంలో నిలిచారు.
  • 2022 మరియు 2023 స్పెల్ బీ పోటీల్లో పాల్గొన్న బృహత్ వరుసగా 74 మరియు 163 స్థానంలో నిలిచారు.

 

హష్ మని కేసులో దోషి డోనాల్డ్ ట్రంప్

  • పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి బిజినెస్ రికార్డులు తారు మారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.
  • ఒక కేసులో దోషిగా తేలిన మొదటి అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ నిలిచాడు
  • జులై 11 శిక్ష ఖరారు చేయనున్న న్యూయార్క్ న్యాయస్థానం, జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నవి.
  • ట్రంప్ పై మొత్తం 34 ఉపయోగాలు రుజువయ్యాయని న్యాయస్థానం తెలిపింది
  • నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ కన్ పార్టీ తరఫున ట్రంప్ బరిలో ఉన్నారు

 

నాగపూర్ లో రికార్డ్ స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • రాందాస్ పేట లోని ఆటోమాటిక్ వెదర్ స్టేషన్ (AWS)లో ఈ మేరకు ఉష్ణోగ్రత నమోదయింది అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది
  • 1913 జూలై 10న కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 56.7° ఉష్ణోగ్రత నమోదయింది, ఇప్పటివరకు ఇదే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత

 

కన్యాకుమారిలో మోడీ ధ్యానం
  • తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాత్ మెమోరియల్ వద్ద ప్రధాన నరేంద్ర మోడీ మే 30 సాయంత్రం నుండి జూన్ 1 సాయంత్రం వరకు 48 గంటలు ధ్యానం చేస్తున్నారు
  • హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే చోట ఉన్న ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద 1892 లో  ధ్యానం చేశారు

 

మానవాభివృద్ధి సూచిలో భారత్ కి 134 వ స్థానం

  • ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ United Nation Development Program (UNDP) వారు 1990 నుండి ప్రతి సంవత్సరం ఈ నివేదికను విడుదల చేస్తున్నారు
  • ఈ సంవత్సరం breaking the grid lock; re imagining cooperation in a polarized world అనే థీమ్ తో 193 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేయడం జరిగింది.
  • ప్రస్తుతం నాలుగు సూచికలలో ప్రగతి ఆధారంగా ఈ నివేదికను అంచనా వేస్తుంది
  1. Life expectance
  2. Expected years of schooling
  3. Mean years of schooling
  4. Gross national income
  • ఈ మానవాభివృద్ధి సూచికను వివిధ కేటగిరీల కింద విభజించడం జరుగుతుంది
  1. 1 నుంచి 69 ర్యాంకులు పొందిన దేశాలను ఎక్కువ మానవ అభివృద్ధి సూచి కలిగిన కేటగిరిలోను
  2. 70 నుంచి 115 ర్యాంకులు పొందిన దేశాలను ఎక్కువ HDI దేశాల కేటగిరిలోను
  3. 116 నుంచి 150 ర్యాంకులు పొందిన దేశాలను మద్యస్థ కేటగిరీలోను
  4. 160 నుంచి 193 ర్యాంకులు పొందిన దేశాలను అల్ప HDI దేశాల కేటగిరిలోనూ చేర్చారు
  • ఈ సంవత్సరం 193 దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలువగా, చివరి స్థానంలో (193వ స్థానం) సోమాలియా అలాగే భారతదేశం ఈ ర్యాంకింగ్స్ లో 134 స్థానంలో నిలిచింది.
  • మొదటి మూడు దేశాలు 1. స్విట్జర్లాండ్ (0.967) , 2 నార్వే (0.966), 3. ఐస్లాండ్ (0.959)
  • చివరి మూడు దేశాలు 193. సోమాలియా (0.380), 192 సౌత్ సుడాన్ (0.381), 191. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (0.387)
  • భారత్ పొరుగు దేశాల ర్యాంకులు  75. చైనా, 79. శ్రీలంక, 125. భూటాన్, 129. బంగ్లాదేశ్

 

లింగ సమానత్వ సూచీలో  వరుసగా 14వ సారి ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది
  • World economical forum (WEF) 2006 నుండి ప్రతి సంవత్సరం ఈ నివేదికను ప్రచురిస్తుంది
  • విద్య, ఆర్థికపరమైన భాగస్వామ్యం, ఉపాధి, రాజకీయ అవకాశాలు, ఆడ శిశు జననాలు, స్త్రీ ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా WEF ఈ నివేదికను ప్రచురిస్తుంది.
  • WEF తన వార్షిక నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 2023 జూన్ 21న విడుదల చేసింది
  • మొత్తం 146 దేశాలతో విడుదల చేసిన ఈ నివేదికలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలువగా భారత్ 127 స్థానంలో నిలిచింది
  • గత సంవత్సరం భారత్ 135వ స్థానంలో నిలిచింది
  • టాప్ 5 దేశాలు 1. ఐస్లాండ్ (0.912), 2 నార్వే (879), 3. ఫిన్లాండ్ (863), 4. న్యూజిలాండ్ (856), 5. స్వీడన్ (815)
ఇతర ముఖ్యంశాలు;
  • నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞ నంద ఐదో రౌండ్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాభియానో కరువానా (USA )పై విజయం సాధించాడు, ఇప్పటికే ఇదే టోర్నీ లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ ను ఓడించే విషయం తెలిసింది, ఈ విజయంతో ప్రజ్ఞ నంద ప్రపంచ ర్యాంకింగ్స్ లో పదో స్థానంలోకి ఎగబాకాడు.
  • NATS (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అధ్యక్షునిగా పాములపాటి మదన్ ఎంపికయ్యారు, ఆయన 2024-26 కాలానికి గాను అధ్యక్షునిగా కొనసాగుతారు
  • తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ ప్రజాకవి రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది

 

#current_affairs 01.06.2024

#current affairs 31.05.2024

#daily current affairs

 

1 thought on “Current Affairs In Telugu / 01-03 June 2024 / GovtJobPreparation.com”

Comments are closed.