Current Affairs In Telugu / 04-16 June 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 04-16 June 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా జూన్ నెల 04 తారీకు నుండి 16 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి విజయం

  • NDA కూటమి 293  స్థానాల్లో విజయం సాధించింది, కూటమిలో అతిపెద్ద పార్టీగా BJP 240 స్థానాల్లో విజయం సాధించింది, ఆ తర్వత టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 12 స్థానాల్లో, శివసేన 07 స్థానాల్లో, రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ 05 స్థానాల్లో, జేడీఎస్ , జనసేన , రాష్ట్రీయ లోక్ దళ్ తలో 2 స్థానాల్లో , కూటమిలోని ఇతర పార్టీలు 07  స్థానాల్లో విజయం సాధించాయి.
  • ఇండియా కూటమి మొత్తం 234 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ 37 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో, డీఎంకే పార్టీ 22 స్థానాల్లో, శివసేన(UBT) 09 స్థానాల్లో, శరత్ పవార్ నేషనల్ కాంగ్రెసు పార్టీ 08 స్థానాల్లో, రాష్ట్రీయ జనతదళ్ పార్టీ 04 స్థానాల్లో, సిపిఎం పార్టీ 04 స్థానాల్లో, కూటమిలోని ఇతర పార్టీలు 22 స్థానాల్లో విజయం సాధించాయి.
  • ఈ లోక్ సభ ఎన్నికల్లో 797 స్థానాల్లో మహిళలు పోటీ చేయగా అందులో 74 స్థానాల్లో విజయం సాధించారు. అత్యదికంగా BJP నుండి 30 మంది, కాంగ్రెస్ నుండి 14 మంది ఎన్నికయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా పశ్చిమ బెంగాల్ నుండి 11 మంది మహిళలు ఎన్నికయ్యారు.
  • నరేంద్ర మోడీ వారణాసి( ఉత్తర ప్రదేశ్) నుండి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై  వరసగా 3వ పోటి చేసి గెలిచాడు.
  • రాహుల్ గాందీ వయనాడ్(కేరళ), రాయ్ బరేలి(ఉత్తర ప్రదేశ్) 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించాడు.
  • అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గం లో BJP అభ్యర్థి లాల్లూ సింగ్ పై సమాజ్ వాది  పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ విజయం సాధించాడు
  • లోక్ సభ ఫలితాలలో ఇద్దరు వ్యక్తులు జైలు నుంచి పోటి చేసి విజయం సాధించారు
  1. అమృత్ పాల్ సింగ్ ఇతను ఖడూర్ సాహిబ్ పార్లమెంటరీ నియోజకవర్గం(పంజాబ్) నుండి విజయం సాధించాడు
  2. ఇంజనీర్ రషీద్ ఇతను బారాముల్ల పార్లమెంటరీ నియోజకవర్గం(జమ్ము కాశ్మీర్) నుండి విజయం సాధించారు.

 

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ప్రపంచ రికార్డ్

  • దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల ఓట్లు పోలయ్యాయి
  • అత్యదికంగా ఓటర్లు ఓటు వేసిన ఎన్నికలుగా ఇది ప్రపంచ రికార్డ్ సృష్టించింది
  • మొత్తం పొలైన ఓట్లలో 31.2 మహిళ ఓటర్లు కావడం విశేషం 
  • భారత దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు

 

T20 ప్రపంచ కప్ విజేతకు 20 కోట్లు

  • 2024 T20 ప్రపంచ కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని 13 కోట్ల నుండి 20 కోట్లకు పెంచుతూ ICC నిర్ణయం తీసుకుంది
  • టోర్నీ మొత్తం ప్రైజ్ మనీని కూడా 46 కోట్ల నుండి 93 కోట్లకు పెంచింది
  • టోర్నీ రన్నరప్ కి 10 కోట్లు
  • సెమీస్ లో ఓడిన టీమ్ లకి 6 కోట్లు, Super 8 లో ఓడిన టీంకు 3 కోట్లు, 9 నుండి 12 స్థానాల్లో నిలిచిన టీం లకి 2 కోట్లు, 13 నుండి 20 స్థానాల్లో నిలిచిన టీం లకి 1.87 కోట్లు దక్కుతాయి.

 

మెక్సికో తొలి మహిళ అధ్యక్షురాలిగా క్లాడియా షేన్ బామ్

  • 200 సంవత్సరాల చరిత్ర గల మెక్సికో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ దేశానికి అధ్యక్షురాలు అయ్యింది
  • 10 కోట్లకు పైగా పోలైన ఓట్లలో క్లాడియ షేన్ బామ్ భారీ మెజార్టీతో గెలిచింది
  • క్లాడియ షేన్ బామ్ గతంలో మెక్సికో సిటీ మేయర్ గా పనిచేశారు

 

పాపువా న్యూగినియా కి భారత్ సాయం 

  • పాపువా న్యూగినియా లో ప్రకృతి విపత్తుల వల్ల దాదాపు 2000 మందికి పైగా మరణించారు
  • ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి ఆ దేశం అంతర్జాతీయం సాయాన్ని కోరడంతో భారత్ కూడా 8.31 కోట్లను సాయంగా ప్రకటించింది 

 

అంతర్జాతీయ ఫుట్ బాల్ కు వీడ్కోలు చెప్పిన చైత్రి

  • భారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛైత్రి జూన్ 06 రోజున కువైట్ తో జరిగిన 2026 FIFA WORLD CUP QWALIFIER మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలికారు
  • ఛైత్రి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ ల సంఖ్య 151, అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు
  • ఛైత్రి చేసిన అంతర్జాతీయ గోల్స్ 94, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు, అంతర్జాతీయంగా చూస్తే రోనాల్డో (128), ఆలీ దే (108), మెస్సీ (106) తర్వాత స్థానం ఛైత్రి దే.
  • ఛైత్రి 2021 లో అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అలాగే 2011 లో అర్జున అవార్డు, 2019 లో పద్మ శ్రీ పురస్కారాలను అందుకున్నారు 
  • ఛైత్రి తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ పాకిస్తాన్ తో 2005 లో ఆడాడు.

భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా పాకిస్థాన్, డెన్మార్క్ సోమాలియా, పనామా, గ్రీస్ 

  • భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వానికి జరిగిన రహస్య ఓటింగ్ లో ఆసియా పసిపిక్ దేశాల తరపున పాకిస్థాన్, ఐరోపా తరఫున డెన్మార్క్, గ్రీస్, ఆఫ్రికా తరపున సోమాలియా, అమెరికా కరేబియన్ గ్రూప్ తరపున పనామా దేశాలు 2 సంవత్సరాల పదవీ కాలానికి నామినేట్ అయ్యాయి
  • రెండేళ్ల పదవి కాలం జనవరి 01, 2025 నుండి ప్రారంభం కానుంది
  • ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు స్విట్జర్లాండ్, జపాన్, మోజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాల పదవీ కాలం డిసెంబర్ 31 తో ముగియనుంది
  • భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు కలవు, అందులో 5 శాశ్వత సభ్య దేశాలు,  ప్రతి 2 సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యే 10 తాత్కాలిక సభ్యదేశాలు 
  • భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఈ భద్రతా మండలికి ఎన్నికైనది.

 

ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాస్ 

  • పారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కారాస్ జర్మనీ ఆటగాడు అలాక్సాండర్ జ్వేరెవ్ పై 6-3,2-6,5-7,6-1,6-2 తేడాతో ఓడించి మొదటి సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు.
  • 2022 యుఎస్ ఓపెన్,2023లో వింబుల్డన్ ఓపెన్ లను కూడా ఇదివరకే గెలుచుకున్నాడు.
  • నాదల్ (19) తర్వత అతిపిన్న వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఆటగాడిగా అల్కరాస్(21) నిలిచాడు.

 

సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమంగ్ 

  • సిక్కిం క్రాంతి కారీ మోర్చా (SKM) పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా వరసగా 2వ సారి ప్రమాణ స్వీకారం చేశారు.
  • అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 32 అసెంబ్లీ సీట్లకు గాను 31 అసెంబ్లీ సీట్లను SKM పార్టీ గెలుచుకున్నాడు
  • సిక్కిం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
  • సిక్కిం రాష్ట్రంలో లోకసభ స్థానాల సంఖ్య 01

 

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ మాఝీ

  • ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా గిరిజన నేత మోహన్ చరణ మాఝీ జూన్ 12 న ప్రమాణ స్వీకారం చేశారు
  • కేంఝూర్ నియోజకవర్గం నుండి 2000,2009,2019,2014 ఎంఎల్ఏ గా ఎన్నికయ్యారు
  • నూతన ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మరియు ప్రవతి ఫరీదా
  • ప్రవతి ఫరీదా ఒడిశా రాష్ట్రానికి తొలి మహిళ ఉప ముఖ్యమంత్రి.
  • ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 చోట్ల BJP విజయం సాధించి తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
  • ఒడిశా రాష్ట్ర గవర్నర్ రఘబర్ దాస్
  • ఒడిశా రాష్ట్రంలో 21 లోకసభ స్థానాలు కలవు,అందులో 20 స్థానాలను BJP గెలుచుకున్నది.

 

అరుణాచల్  ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండ్ 

  • అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గా బీజేపీ పార్టీ అభ్యర్ధి పేమా ఖండు వరసగా 3వ సారి ఆ రాష్ట్ర సిఎం గా బాధ్యతలు స్వీకరించారు
  • అసెంబ్లీ ఫలితాలలో మొత్తం 60 సీట్లకు గాను 46 సీట్లను బీజేపీ పార్టీ గెలుచుకున్నది.
  • 36 సంవత్సరాల తర్వాత ఒక మహిళ దసంగ్లు పుల్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు, ఈమె ఆ రాష్ట్రంలో మంత్రి పదవీ చేపట్టిన 2 మహిళ.
  • అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ KT పర్నాయక్ 

 

రామ్ సర్  సైట్ల జాబితాలోకి బీహార్ లోని మరో 2 చిత్తడి నేలలు 

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (జూన్ 05) పురస్కరించుకొని భారత్ నుండి మరో రెండు సైట్లు రామ్సర్ జాబితాలో చేరాయి, అవి బీహార్ లోని నక్తి పక్షుల సంరక్షణ కేంద్రం మరియు నాగి పక్షుల సంరక్షణ కేంద్రం.
  • ఇప్పటివరకు భారత దేశంలో మొత్తం 82 రామ్ సర్ సైట్స్ గుర్తించబడ్డాయి
  • ప్రపంచ వ్యాప్తంగా 172 దేశాల్లో 2400పైగా చిత్తడి నేలలు ఉన్నాయి, అవి దాదాపు 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి.
  • 1971 ఫిబ్రవరి 02న రామ్ సర్ ఒప్పందం ఇరాన్ లోని రాంసర్ లో జరిగింది, ఈ ఒప్పందం 1975నుండి అమలులోకి వచ్చింది 
  • భారత దేశం ఈ ఒప్పందంలో 1882 ఫిబ్రవరి 01 న చేరింది
  • ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 02
  • అత్యదికంగా  UK లో 175 రామ్ సర్ సైట్స్ కలవు
  • భారత దేశంలో అత్యధికంగా తమిళనాడులో 16 రామ్ సర్ సైట్స్ కలవు.
  • భారత దేశంలో అతిపెద్ద రామ్ సర్ సైట్ సుందర్బన్, ఆతిచిన్నది రేణుక 

 

మరికొన్ని ముఖ్యమైన అంశాలు;

  • సెబి మొబైల్ యాప్ saarthi 2.0
  • జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నూతన డైరెక్టర్ జనరల్ గా సదానంద్ వసంత్ దాతే, ఇతను ఆ పదవిలో డిసెంబర్ 31, 2026 వరకు కొనసాగనున్నారు.
  • జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) నూతన డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్ నియమితులయ్యారు.
  • వ్యాపారవేత్త ఈటీవీ వ్యవస్థాపకుడు రామోజీరావు జూన్ 8, 2024 తెల్లవారుజామున మరణించడం జరిగింది
  • నార్వే చెస్ టోర్నమెంట్ విజేతగా మాగ్నస్ కార్ల్ సన్, భారత స్టార్ ప్లేయర్ ప్రజ్ఞానంద ఈ టోర్నీ లో మూడో స్థానంలో నిలిచాడు
  • భారత ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ సందు ఎంపికయ్యాడు
  • భారత దేశ నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు, ఈ నెల 30 నుండి ఆ బాధ్యతలు స్వీకరిస్తారు,ప్రస్తుతం అతను ఆర్మీ వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న మనోజ్ సీ పాండే జూన్ 30న పదవి విరమణ చేయనున్నారు.
  • భారత దేశానికి చెందిన 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని( తమిళ కవి తిరుమంకై ఆళ్వార్ ) తిరిగి ఇచ్చేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అంగీకారం 
  • విమాన ప్రమాదంలో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలాస్ చిలిమా మృతి, అతనితో పాటు అదే సైనిక విమానంలో ప్రయాణిస్తున్న మరో 11 మంది కూడా మరణించారు
  • దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా ఆఫ్రికన్ నేషనల్ పార్టీ అభ్యర్థి సిరిల్ రామఫోసా తిరిగి ఎన్నికయ్యారు 

 


Also Read;

కరెంట్ అఫ్ఫైర్స్ 2nd & 3rd June 2024

కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వం & మంత్రి మండలి

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం & మంత్రి మండలి