chief justice of india : సుప్రీంకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకామయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐ గా ఉన్న జస్టిస్ BR. గవాయ్ పదవీకాలం నవంబర్ 23 తో ముగియనుండడంతో తన తర్వాతి సీనియర్ అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును తదుపరి సీజేఐ గా అక్టోబర్ 27 తేదీన కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేయడం జరిగింది.
- జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్ట్ కి 53 వ ప్రధాన న్యాయమూర్తి, మరియు హర్యానా రాష్ట్రం నుండి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలువనున్నారు.
- నవంబర్ 24, 2025 నుండి ఫిబ్రవరి 9, 2027 న పదవి విరమణ చేసేవరకు దాదాపుగా 14 నెలల కాలం పాటు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
- జస్టిస్ సూర్యకాంత్ గారు 1962 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
- 1984లో హర్యానా లోని హిస్సార్ జిల్లా కోర్టు లో న్యాయవాదిగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశం.
- 1985లో పంజాబ్ & హర్యానా హైకోర్టులో అడ్వకేట్‌గా
- 2004: పంజాబ్–హర్యానా హైకోర్టులో జడ్జిగా నియామకం.
- 2018: హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం.
- 2019 మే 24: సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పదోన్నతి.
- 2025 నవంబర్ 24: సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం.
- ఆర్టికల్ 370 రద్దు కేసు విచారణలో భాగమయ్యారు. ట్రిపుల్ తలాక్, సబ్‌సిడీ విధానం, అధికారుల నియామకాలు వంటి పలు ప్రముఖ కేసుల్లో తీర్పులు ఇచ్చారు
కాంపిటీటివ్ పరీక్షల కోణంలో చదవాల్సిన ఇతర అంశాలు;
- రాజ్యంగమలోని 5వ భాగంలో 124-147 వరకు గల ఆర్టికల్స్ సుప్రీంకోర్ట్ నిర్మాణం, అధికారాలు, విధులు గురించి తెలియజేస్తాయి.
- స్వాతంత్య్ర న్యాయ వ్యవస్థ భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.
- భారత సుప్రీంకోర్ట్ నిర్మాణం బ్రిటిష్ దేశాన్నీ పోలి ఉంటుంది.
- భారత సుప్రీంకోర్ట్ ఏర్పాటైన తేదీ 28 జనవరి 1950
- ఆర్టికల్ 124(1) సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలుపుతుంది. 1950 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి తో పాటు 7గురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు(1+7). ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 30 మంది ఇతర న్యాయమూర్తులు కలరు(1+30) అయితే గరిష్టంగా ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉండవచ్చు (1+33).
- సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా నియమింపబడే వ్యక్తి భారత పౌరుడై ఉండాలి అలాగే ఏదైనా హైకోర్టులో కనీసం వరుసగా 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం ఉండాలి అలాగే రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అలాగే తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించి రాజీనామా చేయవచ్చు
- ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం 2,80,000 రూపాయలు కాగా, ఇతర న్యాయమూర్తులకు 2,50,000 రూపాయల నెలసరి వేతనం అందుతుంది.
- భారత రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన, ప్రజా సంబంధ విషయాలలో ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు. అయితే ఈ సలహాను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా బాబు రాజేంద్రప్రసాద్ 3 సార్లు సుప్రీంకోర్టు సలహాను తీసుకున్నారు.
- ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు యొక్క Court Of Record అధికారం గురించి చెప్తుంది.
- ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు, కొన్ని రాష్ట్రాలు ఒకవైపు మరియు కేంద్రం మరోవైపు మధ్య వచ్చిన వివాదాలను అలాగే రాష్ట్రాల మధ్య వచ్చిన వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది.
- సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి : హీరలాల్ జె కానియా
- అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి : Y V చంద్రచూడ్ (1978-85)
- అత్యల్ప కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి : K నాగేంద్ర సింగ్
- సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి : మీరా సాహెబ్ ఫాతిమా బీబీ
- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా వ్యవహరించలేదు
- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి దళితుడు : K G బాలకృష్ణన్
- 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి : D Y చంద్రచూడ్
- 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి : సంజీవ్ ఖన్నా
- 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి : B R గవాయ్
- 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి : సూర్యకాంత్
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరుస క్రమం (1950 – 2025)
tags # chief justice of india , govtjobpreparation.com
also read ; పద్మ అవార్డులు 2025

3 thoughts on “chief justice of india / సుప్రీంకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్”
Comments are closed.