RRB NTPC NOTIFICATION 2024 / GovtJobPreparation.com

RRB NTPC NOTIFICATION 2024 ; రైల్వేలో ఖాళీగా ఉన్న 3445 నాన్ టెక్నికల్ పాపులర్ పోస్టుల భర్తీకి RRB NTPC నోటిఫికేషన్ 20 సెప్టెంబర్ 2024 రోజున విడుదల చేయడం జరిగింది. మీరు ఈ జాబ్ కోసం సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లే చేసుకోవచ్చు. RRB విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉన్న వివరాల గురించి మీరు ఈ ఆర్టికల్ చదవడం ద్వారా పూర్తిగా తెలుసుకుంటారు, అలాగే ఆర్టికల్ చివరిలో నోటిఫికేషన్ ద్వారా ఒరిజినల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు , ఇక్కడి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి మీరు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 21 & 22 తేదీలలో పేమెంట్ చేసుకోవడానికి చివరి తేదిగా అలాగే 23 అక్టోబర్ 2024 నుండి 01 నవంబర్ 2024 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది.👇🏻

 

ముఖ్యమైన తేదీలు ;

ప్రభుత్వ ఉద్యోగ తయారీ

 

పోస్టుల వారిగా ఖాళీలు మరియు ఏజ్ పరిమితి వివరాలు ;

ప్రభుత్వ ఉద్యోగ తయారీ

  • ఈ నోటిఫికేషన్ లో Covid 19 కారణంగా జనరల్ కేటగిరిలో వయస్సు గరిష్ట పరిమితిని 30 నుండి 33 సంవత్సరాలకి పెంచడం జరిగింది. కనిష్ఠ వయస్సు అన్ని పోస్టులకు కూడా 18 సంవత్సరాలు.
  • మొత్తం 4 కేటగిరిల్లో ( కమర్షియల్ కం టికెట్ క్లర్క్ – 2022 పోస్టులు), ( అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ – 361 పోస్టులు ), ( జూనియర్ క్లర్క్ కం టైపిస్టు – 990 పోస్టులు), ( ట్రైన్స్ క్లర్క్ – 72 పోస్టులు ) 3445 పోస్టులు కలవు.

విద్యార్హతలు

  • కమర్షియల్ కం టికెట్ క్లర్క్ & ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి, SC,ST,PwBD,Ex Service men అభ్యర్థులు 10+2 కంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లయితే 50% మార్క్స్ మినహాయింపు ఉంటుంది.
  • అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ & జూనియర్ క్లర్క్ కం టైపిస్టు పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి, SC,ST,PwBD,Ex Service men అభ్యర్థులు 10+2 కంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లయితే 50% మార్క్స్ మినహాయింపు ఉంటుంది. ఈ అర్హతతో పాటు టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
  • PwBD అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్ ను కింది పట్టికలో చూడండి.

RRB NTPC Qualification

 

ఫీజు వివరాలు

  • ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది కానీ మీరు మొదటి CBT ఎగ్జామ్
    రాసినట్లయితే 400 రిఫండ్ అవుతుంది.
  • పై 2 కేటగిరీ లు కాకుండా మిగితా అందరికీ అప్లికేషన్ ఫీజు 250 గా ఉంటుంది కానీ మీరు మొదటి CBT ఎగ్జామ్ రాసినట్లయితే మొత్తం ఫీజు 250 రూపాయలు రీఫండ్ అవుతుంది.

 

రిక్రూట్మెంట్ ప్రాసెస్

  • రిక్రూట్మెంట్ మొత్తం మూడు స్టేజీలలో జరుగుతుంది, ( Computer Based Test ) CBT-1, CBT-2 లో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ టెస్ట్ లను నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారికి మెరిట్ ప్రకారం ఉద్యోగం ఇస్తారు.

 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – 1

  • నోటిఫికేషన్ కి అప్లయ్ చేసిన అభ్యర్థులు అందరినీ CBT 1 కి అనుమతిస్తారు.
  • CBT-1 ఆన్లైన్ లో 100 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది, ఈ ఎగ్జామ్ కు 90 నిమిషాల సమయం ఉంటుంది. అయితే PwBD అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఉంటుంది.

RRB NTPC EXAM PATTERN

  • ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గించబడుతుంది.
  • CBT-1 సిలబస్

RRB NTPC CBT 1 SYLLABUS

 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – 2

  • CBT -1 ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో CBT-2 కి అనుమతిస్తారు
  • CBT-1 ఆన్లైన్ లో 120 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది, ఈ ఎగ్జామ్ కు 90 నిమిషాల సమయం ఉంటుంది. అయితే PwBD అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఉంటుంది.

RRB NTPC EXAM PATTERN

  • ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గించబడుతుంది.
  • CBT-2 సిలబస్

RRB NTPC CBT 1 SYLLABUS

టైపింగ్ స్కిల్ టెస్ట్

  • అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ & జూనియర్ క్లర్క్ కం టైపిస్టు ఈ 2 పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ఈ Computer Based Typing Skil Test ఉంటుంది.
  • CBT-2 లో మెరిట్ సాధించిన అభ్యర్థుల లో 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ టైపింగ్ టెస్ట్ కి అనుమతిస్తారు.
  • అభ్యర్థులు ఎలాంటి టూల్స్ లేకుండా తన పర్సనల్ కంప్యూటర్ లో ఇంగ్లీష్ లో ఐతే 30 పదాలు నిమిషానికి, హిందీ లో ఐతే 25 పదాలు నిమిషానికి చేయగలగాలి.
  • టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫెయింగ్ ఎగ్జామ్ మాత్రమే 
  • ఇందులో క్వాలిఫై అయినా అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు

 

డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • CBT-2 లో మెరిట్ ఆధారంగా ( అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ & జూనియర్ క్లర్క్ కం టైపిస్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టైపింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలి ) డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు, ఎక్కడ వెరిఫికేషన్ సజావుగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

నోట్; జోన్ వైజ్ గా ఖాళీల వివరాలు, RRB NTPC NOTIFICATION 2024 లోని ఇతల అంశాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడగలరు.

 

Also Read ;