Current Affairs In Telugu / 01-15 August 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 01-15 August ; ఈ ఆర్టికల్ ద్వారా ఆగస్టు నెల 1 తారీకు నుండి 15 తారీకు వరకు పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

UPSC ఛైర్మన్ గా ప్రీతి సూదన్ 

  • యూపీఎస్సీ చైర్మన్ గా 1963 బ్యాచ్ AP క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూధన్ ఆగస్టు 1 న నియమితులయ్యారు.
  • ఈమె ఏప్రిల్ 29 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు. 
  • ప్రస్తుతం యుపిఎస్సి సభ్యురాలిగా సీనియార్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు.
  • ఇదివరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా మూడేళ్ల పాటు పనిచేసే 2020 జూలైలో పదవి విరమణ చేశారు, ఆ తర్వాత 2022 సెప్టెంబర్ 29 న UPSC సభ్యురాలిగా నియమితులయ్యారు.

 

SC వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం

  • SC రిజర్వేషన్లు ఉప వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది ఉప వర్గీకరణ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఆగస్టు 1 న సుప్రీంకోర్టు ఆమోదం ముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగ పద్ధతి అధికారం ఉందని తీర్పులో వెలువరించింది
  •  SC వర్గీకరణను కొట్టివేస్తూ గతంలో నవంబర్ 05 2024 రోజున EV చిన్నయ్య vs State Of AndhraPradesh కేసులు ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాన్ని ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ప్రస్తుత ధర్మాసనం SC వర్గీకరణకు ఆమోదం తెలిపింది.
  • భారత చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 07 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జూలై 1 న 6:1 ఆధిక్యంతో తీర్పును చెప్పింది
  • SC ల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించడానికి రాష్ట్రాలు నిర్ధిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే విధంగా వర్గీకరణ చెయ్యాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • న్యాయ సమీక్షకు లోబడే ఈ యొక్క వర్గీకరణ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది, రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోకూడదని వాటిని న్యాయస్థానాలు సమీక్షిస్తాయని ఈ తీర్పులో వెలువరించారు.
  • భారత చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ యొక్క 140 పేజీల తీర్పుతో 5 గురు న్యాయమూర్తులు తమ తీర్పులతో ఏకీభవించగా , జస్టిస్ M త్రివేది మాత్రం వారి అభిప్రాయాలతో విభేదించారు.
  • SC వర్గీకరణ ఆర్టికల్ 341 కిందకి రాదని వారు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలను ప్రస్తావించారు.
  • ఈ తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం లోని 7 గురు న్యాయమూర్తులు జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ BR గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ బేల M త్రివేది 

 

ISS యాత్రకి వ్యోమోగమిగా శుభంశు శుక్లా 

  • ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ( ISS) కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన బ్యోమోగమిగా శుభంశు శుక్లా ను ISRO ఎంపిక చేసింది.
  • ఆయనకు ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను ఎంపిక చేసింది.
  • ISRO ఈ మిషన్ ను NASA తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తుంది.
  • NASA గుర్తింపు ఉన్న సర్వీస్ ప్రొవైడర్ యాక్సీమం సంస్థ సూచనల మేరకు ISRO ఈ ఎంపికలు చేసింది.
  • వచ్చే సంవత్సరం ISRO చేపట్టబోయే గగన్ యన్ ( ఇస్రో చేపట్టబోయే తొలి మానవ సహిత యాత్ర ) కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమోగములలో వీళ్ళు ఇద్దరు ఉన్నారు , గగన్ యాన్ లో వీరితో పాటు అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ లు ఉన్నారు.

 

ప్రముఖ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు 

  • భరత నాట్యం, కూచిపూడిలో ప్రముఖ నృత్యకారిని అయిన యామినీ కృష్ణమూర్తి గా వృధ్యాప్య సమస్యలతో ఆగస్టు 3 వ తారీఖున మరణించారు.
  • యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మధనపల్లె లో 1940 డిసెంబర్ 20 న జన్మించారు.
  • యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తాకిగా వ్యవహరించారు.
  • 1977 లో సంగీత నాటక పురస్కారం అందుకున్నారు 
  • 1968 లో పద్మ శ్రీ, 2001 లో పద్మ భూషణ్, 2016 లో పద్మ విభూషణ్ అవార్డులను అందుకోనున్నారు.

 

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ 

  • బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో రాజీనామా చేసిన షేక్ హసీనా స్థానంలో తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనాస్ వ్యవహరించనున్నారు.
  • 1940 లో జన్మించిన యూనస్ సామాజిక కార్యకర్తగా , బ్యాంకర్ గా, ఆర్థిక వేత్తగా మంచి పేరు సంపాదించాడు.
  • మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుండి విముక్తి చేసిన ఘనత ఆయన సాధించారు, అందుకు గాను 2006 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు.
  • యూనస్ 2012-18 వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీకి కులపతిగా, అలాగే చిట్టగాంగ్ యూనివర్సిటీ లో ఆర్థిక శాస్ర ఆచార్యుడిగా సేవలందించారు.

 

 

వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టు నేత బుద్ధదేవ్ కన్నుమూత

  • వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీ నేత బుద్ధదేవ్ భట్టాచార్య ఆగస్టు 8 వృధ్యాప్త సమస్యలతో కన్నుమూశారు.
  • 2000-11 మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  • 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు ను ఇతను తిరస్కరించారు.

 

 

NIRF ఉత్తమ విద్యా సంస్థల జాబితా – 2024 

  • కేంద్ర విద్యా శాఖ ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024 ను NATIONAL INSTITUTIONAL RANKING FRAME WORK పేరుతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివేదికను విడుదల చేశారు.
  • దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా వరసగా 6 వ సారి IIT MADRAS నిలచింది. తర్వాతి స్థానాల్లో IISC BENGALURU, IIT BOMBAY, IIT DELHI నిలిచాయి.
  • దేశంలోని ఉత్తమ విశ్వ విద్యాలయాల జాబితాలో IISC BENGALURU వరసగా 9 వ సారి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో జవహర్ లాల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామీయ నిలిచాయి.
  • దేశంలోని అత్యుత్తమ కళాశాలల విభాగంలో
  1. హిందూ కాలేజీ
  2. మిరాండా కాలేజీ
  3. సెయింట్ స్టీఫెన్ కాలేజీ లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • దేశంలోని అత్యుత్తమ మేనేజ్మెంట్ స్కూల్స్ విభాగంలో
  1. IIM AHMEDABAD
  2. IIM BENGALURU
  3. IIM KOZHIKODE తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • దేశంలోని అత్యుత్తమ దంత వైద్య కళాశాలల విభాగంలో
  1. SAVITHA INSTITUTE OF MEDICAL AND TECHNICAL SCIENCES ( Chennai )
  2. MANIPAL COLLEGE OF DENTAL SCIENCES
  3. MOULANA AZAD INSTITUTE OF DENTAL SCIENCES ( Delhi ) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • దేశంలోని అత్యుత్తమ వైద్య విద్యను అందించే కళాశాలల విభాగంలో
  1. AIIMS ( Delhi )
  2. POST GRADUATE INSTITUTE OF MEDICAL EDUCATION & RESEARCH (Chandigad )
  3. CRISTIAN MEDICAL COLLEGE ( Veeluru ) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • దేశంలోని అత్యుత్తమ న్యాయ విద్యా అధించే కళాశాలల విభాగంలో
  1. NATIONAL LAW SCHOOL OF INDIA VERSITY ( Benguluru )
  2. NATIONAL LAW UNIVERSITY ( Delhi )
  3. NALSAR UNIVERSITY OF LAW ( Hyd ) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • పరిశోధన సంస్థల విభాగంలో
  1. IISC BENGALURU
  2. IIT MADRAS
  3. IIT DELHI తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఆవిష్కరణల విభాగములో
  1. IIT BOMBAY
  2. IIT MADRAS
  3. IIT HYDERABAD తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

 

మరికొన్ని ముఖ్యమైన అంశాలు;

  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నూతన డైరెక్టర్ జనరల్ గా సాధనంద్ వసంత్ దాతే నియమితులయ్యారు.
  • అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ ఖరారు. ఈమె భారత, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు, భారత ములాలున్న ఒక వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటిసారి .
  • హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హమాస్ ను ఇరాన్ లో క్షిపణి దాడితో అంతమొందించిన ఇజ్రాయిల్.
  • వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఎన్నికయ్యాడు. జులై 29 న జరిగిన ఎన్నికలలో 51.2% ఓటు షేరుతో ప్రత్యర్థి ఎడ్మాండో గోన్జాలీజ్ ఉర్టియా పై గెలుపొందాడు.
  • Hindusthan Aeronautical Limited (HAL) తయారుచేసిన 2 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ 228 లను కొనుగోలు చేసేందుకు గయానా దేశం ఒప్పందం కుదుర్చుకుంది.
  • ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా కంపెనీగా భారత్ కి చెందిన LIC నిలిచింది. ( బ్రాండ్ ఫైనాన్స్ 2024 రిపోర్ట్ ప్రకారం )
  • గత సంవత్సరం 2.16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.
  • ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ( మే 31 ) 2024 థీమ్ – PROTECTING CHILDREN FROM TOBACCO INDUSTRY INTERFERENCE
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) 2024 సంవత్సరానికి గాను నెల్సన్ మండేలా పురస్కారాన్ని బెంగుళూర్ కి చెందిన NATIONAL INSTITUTE OF MENTAL HEALTH & NEURO SCIENCES సంస్థకు ప్రధానం చేసింది.
  • SBI ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు నియామకం, ఈ నెల 28 దినేశ్ కుమార్ ఖారా పదవి విరమణ చేయనున్నారు, అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • భారత్ నుండి 2023-24 సంవత్సరంలో ఎక్కువగా ఎగుమతులు జరిగిన దేశాలు వరసగా America, UAE, Netherlands.
  • హిందీ సాహిత్యానికి చేసిన సేవలకు గాను 12 వ విశ్వ హిందీ సమ్మన్ పురస్కారాన్ని డా. ఉషా ఠాకూర్ గారు ఎంపికయ్యారు.
  • international solar alliance లో 100 వ పూర్తి స్థాయి సభ్య దేశంగా పరాగ్వే చేరింది. international solar alliance ప్రధాన కార్యాలయం గుర్గావ్ ( హర్యానా ) లో ఉన్నది.
  • 18 వ National Statistics Day ( జూన్ 29 ) 2024 థీమ్ – Use Of Data For Decision Making 
  • UPI ద్వారా చేసే పేమెంట్స్ రోజువారీ పరిమితిని 1,00,000 నుండి 5,00,000 పెంచుతూ RBI నిర్ణయం తీసుకుంది. దేశంలో UPI యూజర్ల సంఖ్య 42.4 కోట్లకు చేరుకుంది.
  • మెక్సికో దేశ అధ్యక్షురాలిగా క్లాడియా షేన్ భామ్ , ఈమె మెక్సికో దేశ చరిత్రలోనే మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు.
  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ గా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు గారిని నియమించింది.
  • తెలంగాణ జనగణన డైరెక్టర్ 2010 బ్యాచ్ IAS అధికారిణి భారతి హొల్లికేరి నియమితులయ్యారు.
  • హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు ( తెలంగాణ ) రాష్ట్రపతి శౌర్య పురస్కారం , పోలీసుల కి ఇచ్చే అత్యున్నత సహస పురస్కారమైన ఈ రాష్ట్రపతి శౌర్య పురస్కారం దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ పథకానికి ఎంపికైన ఏకైక వ్యక్తి ఇతనే కావడం విశేషం, జులై 25 2022 సంవత్సరంలో గొలుసు దొంగలను పట్టుకునే క్రమంలో దొంగలు కత్తి తో 7 సార్లు పొడిచిన లెక్క చేయకుండా అత్యంత ధైర్య సాహసాలతో ఆ దొంగలను పట్టుకున్నందుకు గాను అతనికి ఈ అవార్డు దక్కింది.
  • ఐరాస లో భారత రాయబారిగా పర్వతనేని హరీష్ నియమితులయ్యారు, ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా. ఇతను 1990 లో ఐఎఫ్ఎస్ అధికారి గా ఎంపికయ్యి వివిధ హోదాల్లో విధులు నిర్వహించడంతో పాటు హైదరాబాద్ ఐపీఎస్ శిక్షణ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా,  ఉత్తరప్రదేశ్ డిజిపి గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. ఆతర్వాత కూడా వివిధ రకాల బాధ్యతలను నిర్వహించారు, ప్రస్తుతం అతను జర్మనీ లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారు.
  • ప్రతిష్టాత్మక పెన్ పింటర్ పురస్కారం 2024 ను ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ గెలుచుకున్నారు. Uk, ఐర్లాండ్ మరియు కామన్వెల్త్ దేశాల కూటమికి చెందిన వ్యక్తులకు సాహిత్యంలో చేసిన సేవలకు గాను 2009 సంవత్సరం నుండి ఈ అవార్డును అందజేస్తున్నారు.

 

 

 

Daily Current Affairs Telugu / August 1 – 15 / GovtJobPreparation.com

1 thought on “Current Affairs In Telugu / 01-15 August 2024 / GovtJobPreparation.com”

Comments are closed.