- కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం / Ap New cabinet 2024; ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కూటమి జూన్ 12 రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు తో సహా మరో 24 మందిని మంత్రులుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ,బండి సంజయ్, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, అనుప్రీయ పటేల్ మరియు NDA పక్ష ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్య మంత్రులు, సినీ ప్రముఖులు మొదలైన వారు హాజరయ్యారు.
- మంత్రి వర్గంలో TDP నుండి 20 మంది, జనసేన నుండి ముగ్గురు, BJP నుండి ఒక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
- 24 మంది మంత్రులలో 17 మంది కొత్తవారే కావడం విశేషం.
- జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయితీరాజ్ – గ్రామీణాభివృద్ధి & అటవీ – పర్యావరణం శాఖల కేటాయింపు.
- మంగళ గిరి నుండి గెలిచిన లోకేష్ కు IT & విద్య శాఖల కేటాయింపు.
- చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకాన్ని 16347 పోస్టులలో కూడిన మెగా DSC నోటిఫికేషన్ విడుదలపై చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం: Ap Cabinet 2024
- నారా చంద్రబాబు నాయుడు; ముఖ్యమంత్రి,, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
మంత్రులు
- పవన్ కళ్యాణ్; ఉప ముఖ్యమంత్రి; పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం,RWS, శాస్ర్తసాంకేతిక శాఖలు
- నారా లోకేష్: విద్య, ఇట్, ఎలాక్రానిక్స్- కమ్యూనికెషన్స్, RTG
- అచ్చేన్నాయుడు: వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్థకం, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖలు
- పయ్యావుల కేశవ్: ఆర్థిక,ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు
- వంగలపూడి అనిత: విపత్తుల నిర్వహణ, హోం శాఖ
- కొల్లు రవీంద్ర: ఎక్సైజ్, భూగర్భ గనులు
- నాదెండ్ల మనోహర్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు
- పొంగురు నారాయణ: పట్టణాభివృద్ధి, పురపాలక శాఖలు
- సత్య కుమార్ యాదవ్: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- నిమ్మల రామానాయుడు: జల వనరుల అభివృద్ధి
- Md ఫరూక్: మైనారిటీ, న్యాయ సంక్షేమం
- ఆనం రామ్ నారాయణ రెడ్డి: దేవాదాయ శాఖ
- అనగని సత్య ప్రసాద్: రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
- కొలను పార్థసారథి: పౌర సంబధాలు, గృహ నిర్మాణం, సమాచార శాఖ
- డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి: సచివాలయం, గ్రామ వాలంటీర్లు, సాంఘిక సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమం
- గొట్టిపాటి రవికుమార్: విద్యుత్తు
- కందుల దుర్గేశ్: సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
- గుమ్మిడి సంధ్యా రాణి: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
- TG భరత్ : పరిశ్రమలు- వాణిజ్యం, ఆహార శుద్ధి
- BC జనార్థన్ రెడ్డి: రహదారులు – భవనాలు, మౌలిక వసతులు – పెట్టుబడులు
- S సవిత: చేనేత, జౌళి, బీసీ సంక్షేమం, వెనుక బడిన వర్గాల సంక్షేమం
- వానంశెట్టి సుభాష్: కార్మిక కర్మాగారాలు – బాయిలర్లు, వైద్య బీమా శాఖలు
- M రామ్ ప్రసాద్ రెడ్డి: క్రీడలు,రవాణా, యువజన వ్యవహారాలు
- కొండపల్లి శ్రీనివాస్: సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎన్నారై సాధికారత సంబంధాలు
Also Read posts ;
కేంద్ర ప్రభుత్వం & మంత్రి మండలి