Current Affairs In Telugu / 31 May 2024 / GovtJobPreparation.com

Current Affairs In Telugu / 31 May 2024 ; ఈ ఆర్టికల్ ద్వారా మే 31 2024 రోజున పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన సంఘటనలను / కరెంట్ అఫైర్స్ ను ప్రభుత్వ వెబ్సైట్లు మరియు న్యూస్ పేపర్ లను బేస్ గా తీసుకొని ఆ కంటెంట్ కు సంబంధించిన స్టాటిక్ పాయింట్లను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
  • చెన్నై కు చెందిన స్పేస్ స్టార్ట్ అప్ అగ్నికుల్ కాస్మోల్ సెమీ క్రిస్మస రాకెట్ అయిన అగ్నిబాణ్ ను 13 మే 2024 రోజున విజయవంతంగా ప్రయోగించడం జరిగింది
  • స్పేస్ లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేట్ సంస్థగా అగ్నికుల్ కాస్మోల్ నిలిచింది.
  • స్పేస్ లోకి రాకెట్ పంపిన మొదటి ప్రైవేట్ సంస్థ  SKY ROOT AEROSPACE.
  • SKY ROOT AEROSPACE అనే సంస్థ పంపిన రాకెట్ పేరు VIKRAM-S
  • సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (శ్రీహరికోట) లో సొంత లాంచ్ ప్యాడ్ కలిగి ఉన్న ఏకైక ప్రైవేట్ సంస్థ అగ్నికుల్ కాస్మోల్ .
  • ఈ రాకెట్ లో ఉపయోగించే ఇంజన్ కు అగ్ని లేట్ అని పేరు పెట్టడం జరిగింది
  • ఈ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే
  • అగ్నికుల్ కాస్మోల్ సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్.

 

తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ

  • తెలంగాణ ప్రజాకవి అండర్ శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా తెలంగాణ క్యాబినెట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది
  • ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్ మరియు 13.30 నిమిషాలు నిడివితో మరొక వెర్షన్ గా ఉంటుంది ఈ రెండు వెర్షన్ కూడా తెలంగాణ రాష్ట్ర గీతం గానే పరిగణిస్తారు.

 

చెస్ క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్ సన్ పై ప్రజ్ఞనంద విజయం
  • నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ పై భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారిగా విజయం
  • ప్రజ్ఞానంద గతంలో కార్ల్ సన్ ను బ్లిట్జ్ మరియు ర్యాపిడ్ ఫార్మాట్లో ఓడించడం జరిగింది
  • గతంలో వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్  రెండు గేములు జరిగాయి అవి రెండు కూడా డ్రాగా ముగిసాయి.

#Appsc

#TSPSC

#CURRENT_AFFAIRS

 

1 thought on “Current Affairs In Telugu / 31 May 2024 / GovtJobPreparation.com”

Comments are closed.